India Stand On Jammu Kashmir: కశ్మీర్‌ను ఖాళీ చేయాల్సిందే.. భారత్ వార్నింగ్
ABN, Publish Date - May 14 , 2025 | 09:29 AM
Operation Sindoor: జమ్మూ కశ్మీర్ విషయంలో తగ్గేదే లేదని అంటోంది భారత్. ఖాళీ చేయాల్సిందేనంటూ పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇస్తోంది ఇండియా. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. శత్రుదేశంతో చర్చలు జరగాలంటే ఉగ్రవాదం నిర్మూలణ, పాక్ ఆక్రమిత కశ్మీర్ కీలకం అవుతాయని.. వీటిపై వైఖరి స్పష్టం చేస్తేనే చర్చలు ఉంటాయంటూ సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్‌బీర్ జైస్వాల్ ఆయన వ్యాఖ్యల్ని మరింత బలపరుస్తూ కశ్మీర్ అంశంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో భారత్ ఎప్పుడూ ఒకే వైఖరితో ఉందని.. ఇందులో ఎలాంటి మార్పు లేదన్నారు. కశ్మీర్‌ను పాక్ ఖాళీ చేయాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు.
తేల్చుకుంటాం..
కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్ విషయంలో ఏళ్లుగా భారత్ ఒకే వైఖరితో ఉందని రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు. ఇది ఇండో-పాక్ ద్వైపాక్షికంగా తేల్చుకోవాల్సిన అంశమని స్పష్టం చేశారు. ఇందులో ఎవరి మధ్యవర్తిత్వానికీ చోటు లేదన్నారు. ఈ పాలసీలో ఎలాంటి మార్పు లేదన్నారు. కశ్మీర్‌ను పాక్ ఖాళీ చేయాల్సిందేనని.. ఈ డిమాండ్‌లో మార్పు లేదని పేర్కొన్నారు. కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు తాను రెడీగా ఉన్నానంటూ అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఈ ట్వీట్‌తో కశ్మీర్ విషయంలో మూడో శక్తికి చోటు ఇవ్వడం ఏంటంటూ విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఇది భారత్-పాక్ ద్వైపాక్షికంగా తేల్చుకోవాల్సిన అంశమని, ఇందులో మరో దేశ ప్రమేయానికి తావు లేదని స్పష్టం చేసింది. ఈ విధంగా ఒకవైపు పాక్‌కు వార్నింగ్ ఇస్తూనే.. మరోవైపు అనవసరంగా కశ్మీర్ అంశంలోకి దూరేందుకు ప్రయత్నిస్తున్న ట్రంప్‌కూ చురకలు అంటించింది కేంద్రం. అలాగే విపక్షాల విమర్శలకూ చెక్ పెట్టింది.
ఇవీ చదవండి:
అబద్ధాల ఫ్యాక్టరీ.. పాకిస్థాన్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - May 14 , 2025 | 09:47 AM