Missile System: మరిన్ని ఎస్ 400లు కావాలి..
ABN , Publish Date - May 14 , 2025 | 06:07 AM
ఆపరేషన్ సిందూర్‌లో సార్ధకంగా పనిచేసిన రష్యా ఎస్-400 క్షిపణి వ్యవస్థను బట్టి భారత్ మరిన్ని ఎస్-400లను రష్యా నుండి కోరిందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. పాక్ క్షిపణులు, డ్రోన్లను సమర్థంగా కూల్చేసిన ఈ వ్యవస్థను ఇండియాలో ‘సుదర్శన్ చక్ర’గా అభివర్ణిస్తున్నారు.
రష్యాను కోరిన భారత్
న్యూఢిల్లీ, మే 13: ఆపరేషన్ సిందూర్‌లో రష్యాకు చెందిన ఎస్-400 క్షిపణి వ్యవస్థ కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో మరిన్ని ఎస్-400లు కావాలని భారత్ రష్యాను కోరినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. దీనికి రష్యా కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ క్షిపణులు, డ్రోన్లను సమర్థంగా పేల్చేసిన ఎస్-400ను ఇండియాలో ‘సుదర్శన్ చక్ర’గా అభివర్ణిస్తున్నారు. ఎస్-400 ఆయుధ వ్యవస్థ 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. శత్రుదేశాలకు చెందిన క్షిపణులు, డ్రోన్లను 400కిలోమీటర్ల దూరంలో ఉండగానే గుర్తించి పేల్చివేయగలదు. భారతదేశం 2018లో 5.43బిలియన్ డాలర్లతో ఐదు ఎస్-400లను కొనుగోలు చేసింది. కాగా, ఆపరేషన్ సిందూర్‌లో భారత్ సొంత ఆయుధాలు చక్కని పనితీరును కనబర్చాయని అమెరికా ఆర్మీ మాజీ అధికారి ప్రశంసించారు. అదే సమయంలో చైనా ఆయుధాలు విఫలమయ్యాయన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్
CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..