Share News

CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ..

ABN , Publish Date - May 13 , 2025 | 08:28 PM

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.

CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ..
CM Chandrababu naidu

అమరావతి, మే 13: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. మంగళవారం విజయవాడలోని చీఫ్ జస్టిస్ నివాసంలో ఆయనతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ భేటీ సాగింది. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుతోపాటు ఇటీవల రాజధాని అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి.. అందులో హైకోర్టు నిర్మాణ సముదాయం, జడ్జిల క్వార్టర్స్ నిర్మాణంతోపాటు చీఫ్ జస్టిస్ నివాసానికి సంబంధించిన డిజైన్లను హైకోర్టు చీఫ్ జస్టిస్‌ ఠాకూర్‌కు సీఎం చంద్రబాబు వివరించారని సమాచారం.


అయితే ఈ భేటీలో చర్చించిన అంశాలను ఉన్నతాధికారులు ఎవరూ ధృవీకరించ లేదు. అయితే ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. మరోవైపు హైకోర్టుకు సైతం మే 12వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. దాదాపు నెల రోజులపాటు సెలవులు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణానికి సంబంధించి హైకోర్టుతోపాటు అసెంబ్లీ, వివిధ భవనాల నిర్మాణాలకు టెండర్లు పిలిచారు. ఆ టెండర్లు సైతం ఇప్పటికే ఫైనల్ అయ్యాయి. మరోవైపు ఆ భవన నిర్మాణాల ఆకృతులకు సంబంధించిన టెండర్లూ పూర్తయ్యాయి. వీటన్నింటిని పరిశీలించి సలహాలు సూచనలు తీసుకునేందుకే హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను సీఎం చంద్రబాబు కలిసి ఉంటారనే ఒక చర్చ ప్రధానంగా నడుస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

Kodali Nani: కొడాలి నానిపై సీరియస్.. వీడియో వైరల్

CM Chandrababu: 5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం

చార్మినార్ వద్ద ప్రపంచ సుందరీమణుల హెరిటేజ్ వాక్

Opertaion Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన

DD Next Level Movie: శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్న మూవీపై పోలీసులకు ఫిర్యాదు

Bellamkonda Sai Sreenivas: టాలీవుడ్ హీరో ఓవర్ యాక్షన్

Vallabhaneni Vamsi: వంశీని ఆసుపత్రికి తరలించిన పోలీసులు

Operation Sindoor: భారత్ దాడుల్లో 11 మంది సైనికులు మృతి: పాకిస్థాన్

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 13 , 2025 | 09:13 PM