Share News

Vallabhaneni Vamsi: వంశీని ఆసుపత్రికి తరలించిన పోలీసులు

ABN , Publish Date - May 13 , 2025 | 03:41 PM

Vallabhaneni Vamsi: టీడీపీ కార్యకర్త కిడ్నాప్ కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఎస్సీ, ఎస్టీ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. తనకు అనారోగ్యంగా ఉందని కోర్టుకు మాజీ ఎమ్మెల్యే తెలిపారు. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షల కోసం అతడిని ఆసుపత్రికి తరలించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.

Vallabhaneni Vamsi: వంశీని ఆసుపత్రికి తరలించిన పోలీసులు
Former MLA Vallabhaneni Vamsi

విజయవాడ, మే 13: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంలో కీలక సాక్షి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని మంగళవారం పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యక కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా తనకు అనారోగ్యంగా ఉందని కోర్టుకు వల్లభనేని వంశీ తెలియజేశారు. తాను మాట్లాడేందుకు ఊపిరి తీసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని కోర్టుకు ఆయన వివరించారు.

ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీని ఆసుపత్రికి తీసుకు వెళ్లి వైద్య చికిత్స అందించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. అలాగే వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై మెమో దాఖలు చేయాలని అతడి తరపు న్యాయవాదిని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు ఆదేశించింది. అదే విధంగా వల్లభనేని వంశీ రిమాండ్‌ను బుధవారం వరకు కోర్టు పోడిగించింది.


మరోవైపు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసును నీరుగార్చే ఉద్దేశంతోనే వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌తోపాటు అతడి అనుచరులు.. ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేయడంతోపాటు దాడి చేశారని పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. తాము చెప్పినట్లు వినకపోతే నిన్ను, నీ కుటుంబాన్ని అంతమొందిస్తామని బెదిరించి తమకు అనుకూలంగా వాంగ్మూలం ఇప్పించినట్లు పోలీసుల విచారణలో బహిర్గతమైంది. దీంతో ఈ కేసు దర్యాప్తు అధికారి, సెంట్రల్‌ ఏసీపీ దామోదర్‌ సోమవారం విజయవాడలోని ఎస్సీ,ఎస్టీ కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేసిన విషయం విధితమే. అదీకాక ఈ కేసులో సీసీ కెమెరా ఫుటేజ్‌లు కీలకమయ్యాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

Operation Sindoor: భారత్ దాడుల్లో 11 మంది సైనికులు మృతి: పాకిస్థాన్

PM Modi: మోదీ సర్‌ప్రైజ్... ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో జవాన్లను కలిసిన ప్రధాని..

Terrorists Trapped: జుమ్మూలో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాదుల హతం

Operation Sindoor: అణువణువూ జల్లెడ పడుతున్న భారత్.. ఆచూకీ చెబితే 20 లక్షలు

For AndhraPradesh News And Telugu news

Updated Date - May 13 , 2025 | 03:47 PM