Terrorists Trapped: జుమ్మూలో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాదుల హతం
ABN , Publish Date - May 13 , 2025 | 11:31 AM
Encounter In Jammu And Kashmir: మంగళవారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కర్ ఈ తోయిబాకు చెందిన ఓ ఉగ్రవాది చనిపోయినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు చుట్టు ముట్టినట్లు సమాచారం.
సౌత్ కాశ్మీర్‌లోని షోపియాన్, శుక్రూ కెల్లర్ ఏరియాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మంగళవారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కర్ ఈ తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు. చనిపోయిన ఉగ్రవాదుల్లో స్థానిక వ్యక్తి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అతడి పేరు షాహిద్‌గా తెలుస్తోంది. ముగ్గురు ఉగ్రవాదులు.. భద్రతా బలగాల మధ్య గంటకు పైగా కాల్పులు జరిగాయి. భద్రతా దళాల కాల్పుల్లో మొదట ఓ ఉగ్రవాది చనిపోయాడు. మిగిలిన ఇద్దర్నీ చుట్టు ముట్టిన బలగాలు అరగంట వ్యవధిలోనే కాల్చి చంపేశాయి.
ఆచూకీ చెబితే 20 లక్షలు
ఏప్రిల్ 22వ తేదీ పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడ్డట్టు భావిస్తున్న పాకిస్తానీ ఉగ్రవాదులు ఆదిల్ హుస్సేన్ తోకర్, అలీ భాయ్, హసీమ్ ముసాల కోసం వేట కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే భద్రతా దళాలు జమ్మూకాశ్మీర్‌లోని పలు జిల్లాల్లో వారి ఫొటోలు ఉన్న పోస్టర్లను అంటించాయి. ఆ ముగ్గురి గురించిన సరైన సమాచారం అందించిన వారికి 20 లక్షల రూపాయల రివార్డు ఇస్తామని ప్రకటించాయి.