Home » terrorist
ఉగ్రవాది మసూద్ అజర్‌పై ఇనామ్ పెంచుతున్నట్లు పాకిస్థాన్ చేసిన ప్రకటన ఓ 'డ్రామా' అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ప్రపంచాన్ని మోసం చేయడానికి పాక్ ఇలాంటి కుయుక్తులు పన్నడం కొత్తేమీ కాదన్నారు.
అక్టోబర్‌లో జరగనున్న 'ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్' సమావేశంలో మళ్లీ గ్రే లిస్ట్‌లో పడకుండా తప్పించుకోవడానికి పాకిస్థాన్ మరోసారి అంతర్జాతీయ సమాజాన్ని బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తోంది.
జమ్మూ కశ్మీర్‌లోని బద్గాం జిల్లా యూస్‌మార్గ్ పర్వత ప్రాంతంలో లష్కరే తొయిబాకు చెందిన పాకిస్థానీ కమాండర్ 'యాసిర్' హతమయ్యాడు. ఆర్మీకి చెందిన 53 రాష్ట్రీయ రైఫిల్స్, స్పెషల్ ఫోర్సెస్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి.
కర్నూలు జిల్లాలో ఉగ్ర కలకలం రేపింది. నూర్ మహమ్మద్ అనే అనుమానిత ఉగ్రవాదిని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం ఉగ్రవాదిని ప్రత్యేక భద్రత మధ్య హైదరాబాద్‌కు తరలించారు.
పెద్దపల్లిలోని రామగుండంలో ఎన్ఐఏ నిర్వహించిన తనిఖీల్లో ఉగ్ర లింకులు బయటపడ్డాయి. ఓ ఇంజినీరింగ్ విద్యార్థికి టెర్రరిస్ట్ గ్రూప్‌లతో సంబంధాలున్నట్టు సమాచారం.
బెంగళూరులో అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ 25 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పాకిస్థాన్‌లో లష్కరే తోయిబాకు చెందిన మరో కీలక కమాండర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. ఆ సంస్థ సీనియర్ కమాండర్ అయిన ఖారీ సయీద్ అబ్దుల్ అజీజ్ ఇస్లామాబాద్‌లోని ఖుబా మసీదు వద్ద అకస్మాత్తుగా కుప్పకూలి మరణించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.
పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయ్యిబాకు చెందిన కీలక సభ్యుడు రిజ్వాన్ హనీఫ్ తాజాగా సంచలన విషయాలను వెల్లడించాడు. రిజ్వాన్‌కు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది.
పశ్చిమ బెంగాల్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసిన మొహమ్మద్ హమీమ్ మోండల్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థతో పాటు పాకిస్తాన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐతో మోండల్‌కు సంబంధాలు ఉన్నట్లు బయటపడింది.
పశ్చిమ బెంగాల్ పోలీసు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఉగ్ర కుట్రను భగ్నం చేసింది. ఇటీవలే అరెస్టైన జైషే మహమ్మద్ అనుమానిత ఉగ్రవాది మహమ్మద్ హమీమ్ మోండల్ స్నేహితురాలు అర్పిత సర్కార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.