Saira Banu: కడపలో ఉగ్రవాది అబూబకర్ సిద్ధికి భార్య సైరా భానును కస్టడీకి తీసుకున్న NIA
ABN , Publish Date - Oct 22 , 2025 | 03:45 PM
కడప సెంట్రల్ జైలుకు వచ్చిన NIA అధికారులు.. రాయచోటిలో ఇటీవల అరెస్ట్ అయిన ఉగ్రవాది అబూబకర్ సిద్ధికి భార్య సైరా భానును కస్టడీకి తీసుకున్నారు. జులై 1న ఇద్దరు ఉగ్రవాదుల్ని తమిళనాడు ఐబీ అధికారులు అరెస్టు..
కడప, అక్టోబర్ 22: కడప సెంట్రల్ జైలుకు వచ్చిన జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency) అధికారులు.. రాయచోటిలో ఇటీవల అరెస్ట్ అయిన ఉగ్రవాది అబూబకర్ సిద్ధికి భార్య సైరా భానును కస్టడీకి తీసుకున్నారు. జులై 1న రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులు.. అబూబకర్ సిద్ధికి, మహమ్మద్ అలీని తమిళనాడు ఐబీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
అప్పట్లో ఈ ఇద్దరు ఉగ్రవాదుల భార్యలనూ అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి కడప జైలుకు తరలించారు. ప్రస్తుతం ఉగ్రవాది అబూబకర్ సిద్ధికి భార్య సైరాబాను, మహమ్మద్ అలీ భార్య షమీం కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.
అయితే, ఇవాళ (బుధవారం) అబూబకర్ సిద్ధికి భార్య సైరాబానును NIA అధికారులు కస్టడీకి తీసుకున్నారు. పీటీ వారెంట్ పై వారం రోజులు పాటు సైరా భానును కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. దీని కోసం సైరా బానును ఎన్ఐఏ అధికారులు విజయవాడకు తీసుకెళ్లారు.
ఇవి కూడా చదవండి..
అయ్యప్ప సేవలో ద్రౌపది ముర్ము.. శబరిమలను దర్శించుకున్న తొలి రాష్ట్రపతి
వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ప్రధాని మోదీ గురించి ట్రంప్ ఏమన్నారంటే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి