Sajid Akram Case: ఆ ఐసిస్ ఉగ్రవాది ఆరుసార్లు హైదరాబాద్ వచ్చారు: డీజీపీ శివధర్ రెడ్డి..
ABN , Publish Date - Dec 19 , 2025 | 04:40 PM
సాజిద్ అక్రమ్ 27 సంవత్సరాల కాలంలో ఆరుసార్లు మాత్రమే భారతదేశానికి వచ్చాడని వెల్లడించారు. 1998లో అక్రమ్ ఉపాధి కోసం ఆస్ట్రేలియా వెళ్లాడని.. ఆ తర్వాత అదే సంవత్సరం యురోపియన్ కు చెందిన యువతి వెనెరా గ్రోసోని వివాహం చేసుకున్నాడని తెలిపారు.
హైదరాబాద్: ఆస్ట్రేలియా బాండీ బీచ్‌లో కాల్పులకు తెగబడి పోలీసుల చేతుల్లో హతమైన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఉగ్రవాది సాజిద్ అక్రమ్(Terrorist Sajid Akram)కు హైదరాబాద్(Hyderabad)తో సంబంధాలున్న సంగతి తెలిసిందే. అతను హైదరాబాద్ నగరంలోనే బీకామ్ వరకూ చదివారని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి(DGP Shivadhar Reddy) తెలిపారు. సాజిద్ అక్రమ్ 27 సంవత్సరాల కాలంలో ఆరుసార్లు మాత్రమే భారతదేశానికి వచ్చాడని వెల్లడించారు. 1998లో అక్రమ్ ఉపాధి కోసం ఆస్ట్రేలియా వెళ్లాడని.. ఆ తర్వాత అదే సంవత్సవరం యురోపియన్ కు చెందిన యువతి వెనెరా గ్రోసోని వివాహం చేసుకున్నాడని తెలిపారు.
పెళ్లి అయిన అదే ఏడాది మెుదటిసారిగా భార్యతో కలిసి హైదరాబాద్ వచ్చాడని చెప్పారు. 2004లో ఓసారి, 2009 ఫిబ్రవరిలో మరోసారి నగరానికి వచ్చాడని డీజీపీ వెల్లడించారు. 2011 జూబ్లీ ప్రాపర్టీ సెటిల్మెంట్ ఇంకోసారి వచ్చాడని, 2016 మరోసారి ప్రాపర్టీ సెటిల్మెంట్ కోసం ఇక్కడికి వచ్చాడని చెప్పుకొచ్చారు. 2022 తల్లి, సోదరిని చూడటం కోసం నగరానికి డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. కాగా, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాతో సంబంధం ఉన్న తండ్రీకొడుకులు సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్.. యూదులంతా బాండీ బీచ్‌లో హునెక్కా పండుగ చేసుకుంటుండగా కాల్పులకు తెగబడ్డారు.
ఈ కాల్పుల్లో 16 మంది మృతిచెందగా.. 36 మంది గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో సాజిద్ అక్రమ్ అక్కడికక్కడే మృతిచెందగా.. అతని కుమారుడు నవీద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు నవీద్‌పై న్యూ సౌత్‌వేల్స్ పరిధిలోని బాండీ బీచ్ పోలీసులు మొత్తం 59 నేరాలకు పాల్పడినట్టు అభియోగాలు నమోదు చేశారు. వాటిలో 15 హత్యలు, ఓ ఉగ్రవాద చర్యకు సంబంధించిన కేసులు ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
BJP State President Ramachandra Rao: పంచాయతీ ఎన్నికలపై రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు
ake Rs 500 Notes: రూ. 500 నకిలీ నోట్ల కలకలం.. రైతును అదుపులోకి తీసుకున్న పోలీసులు