BJP State President Ramachandra Rao: పంచాయతీ ఎన్నికలపై రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 19 , 2025 | 04:21 PM
తెలంగాణలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు, ట్రెండ్స్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. తాజాగా ఎన్నికల ఫలితాలు, ట్రెండ్స్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు నిర్మల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. గత ఎన్నికలతో పోల్చితో ఈసారి బీజేపీ గణనీయమైన పురోగతి సాధించిందని అన్నారు. గతంలో ప్రాతినిధ్యం లేని జిల్లాల్లో కూడా ఈసారి బీజేపీకి మంచి ఓటింగ్ పడింది. కేంద్రం తీసుకువస్తున్న పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే రోజు రోజుకీ బీజేపీపై ప్రజలకు విశ్వాసం పెరిగిపోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నిధులతో జరుగుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం నిధులను తమ స్వలాభం కోసం ఖర్చు చేయకుండా చూడాలంటే రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ విజయాల గురించి గొప్పలు చెప్పుకుంటున్నాయి. చాలా చోట్ల అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయని విమర్శించారు. కానీ బీఆర్ఎస్ - కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదు.. రెండో ఒక్కటే. మహాత్మా గాంధీ అంటే బీజేపీకి ఎంతో గౌరవం, రామరాజ గ్రామస్వరాజ్యం కోసమే ఉపాధి హామీ పథకం పేరు మార్చడం జరిగిందని అన్నారు. ఉపాధి హామీ పథకం ఇంతకు ముందు 100 రోజులు ఉంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం 120 రోజులకు పెంచింది.. దీని వల్ల ఎంతో మంది నిరుపేదలకు లాభం చేకూరుతుందని తెలిపారు.
ఇవి కూడా చదవండి...
ఐటీ ఉద్యోగులే టార్గెట్‌గా గంజాయి సరఫరా.. చెక్ పెట్టిన పోలీసులు
సంక్షేమం పక్కనపెట్టి ఫుట్‌బాల్‌పై రూ.10 కోట్లు ఖర్చు.. సీఎం రేవంత్‌పై కవిత విమర్శలు