Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా దళాలు
ABN , Publish Date - Nov 05 , 2025 | 10:22 AM
జమ్మూకశ్మీర్ కిష్తివాడ్‌లోని ఛత్రు ప్రాంతంలో ఉగ్రవాదులు కొన్ని నెలలుగా దాక్కున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న సైనికులు, కశ్మీర్ పోలీసులతో కలిసి సంయుక్త బృందాలుగా ఏర్పడి ఉగ్రవాదులపై దాడి చేశారు.
జమ్మూకశ్మీర్ కిష్తివాడ్ జిల్లాలో ఆపరేషన్ ఛత్రు కొనసాగుతోంది. ఛత్రూలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్టు గుర్తించిన భద్రతా దళాలు ముందస్తు సమాచారంతో కూంబింగ్ నిర్వహించారు. ఉగ్రవాదుల జాడను గుర్తించి.. చుట్టుముట్టారు. దీంతో కిష్తివాడ్ జిల్లా ఛత్రూలో సైనికులు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ మేరకు పోలీసులతో కలిసి ఆపరేషన్ ఛత్రు చేపట్టినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.
కిష్తివాడ్‌లోని ఛత్రు ప్రాంతంలో ఉగ్రవాదులు కొన్ని నెలలుగా దాక్కున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న సైనికులు, కశ్మీర్ పోలీసులతో కలిసి సంయుక్త బృందాలుగా ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఇవాళ(బుధవారం) తెల్లవారుజామున సెర్చ్ ఆపరేషన్‌ను నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read:
నేడు కార్తీక పౌర్ణమి.. ఈ పనులు చేస్తే లక్ష్మీ కటాక్షమే..
గుడ్ న్యూస్.. మరింతగా తగ్గిన బంగారం, వెండి ధరలు