Gold Rates on Nov 5 : గుడ్ న్యూస్.. మరింతగా తగ్గిన బంగారం, వెండి ధరలు
ABN , Publish Date - Nov 05 , 2025 | 06:32 AM
డాలర్ కరెన్సీ బలపడటంతో బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఫెడ్ రేట్ కోతపై ఆశలు సన్నగిల్లుతుండటం కూడా పసిడి ధరలను మరింత తగ్గేలా చేస్తోంది. మరి ఈ నేపథ్యంలో దేశంలో వివిధ నగరాల్లో బంగారం, వెండి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: డాలర్ బలపడుతున్న నేపథ్యంలో బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఫెడ్ రేట్‌లో కోతపై కూడా ఆశలు సన్నగిల్లుతుండటంతో బంగారం రేటు నానాటికీ పడిపోతోంది. అంతర్జాతీయ ట్రెండ్స్‌ను ప్రతిఫలిస్తూ భారత్‌లో కూడా పసిడి ధరలు దిద్దుబాటుకు లోనవుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి (బుధవారం) ఉదయం 6.30 గంటల సమయంలో దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ. 1,22,540గా ఉంది. నిన్నటితో పోలిస్తే సుమారు రూ.800 మేర ధరలో కోత పడింది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,450 వద్ద కొనసాగుతోంది. వెండి ధరల్లో కూడా భారీగా కోత పడింది. కిలో వెండి ధర రూ.3200 మేర తగ్గి రూ.1,50,900కు చేరుకుంది (Gold Rates on Nov 5).
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఔన్స్ 24 క్యారెట్ బంగారం ధర 3,969 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక డాలర్ సూచీ 0.12 శాతం మేర పెరిగి 99.99కు చేరుకుంది. గత మూడు నెలల్లో ఇదే గరిష్ఠం. దీంతో, పసిడి, వెండి ధరలు దిగొస్తున్నాయి. ఈ వారమంతా బంగారం ధరల్లో దిద్దుబాట్లు తప్పవనేది మార్కెట్ వర్గాల అంచనా.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా (24కే, 22కే, 18కే)
చెన్నై: ₹1,22,720; ₹1,12,490; ₹93,890
ముంబై: ₹1,22,450; ₹1,12,240; ₹91,830
ఢిల్లీ: ₹1,22,500; ₹1,12,390; ₹91,980
కోల్‌కతా: ₹1,22,450; ₹1,12,240; ₹91,830
బెంగళూరు: ₹1,22,450; ₹1,12,240; ₹91,830
హైదరాబాద్: ₹1,22,450; ₹1,12,240; ₹91,830
విజయవాడ: ₹1,22,450; ₹1,12,240; ₹91,830
కేరళ: ₹1,22,450; ₹1,12,240; ₹91,830
పూణె: ₹1,22,450; ₹1,12,240; ₹91,830
వడోదరా: ₹1,22,500; ₹1,12,290; ₹91,880
అహ్మదాబాద్: ₹1,22,500; ₹1,12,290; ₹91,880
వెండి ధరలు ఇవీ
చెన్నై: ₹1,64,900
ముంబై: ₹1,50,900
ఢిల్లీ: ₹1,50,900
కోల్‌కతా: ₹1,50,900
బెంగళూరు: ₹1,50,900
హైదరాబాద్: ₹1,64,900
విజయవాడ: ₹1,64,900
కేరళ: ₹1,64,900
పూణె: ₹1,50,900
వడోదరా: ₹1,50,900
అహ్మదాబాద్: ₹1,50,900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.
ఇవీ చదవండి:
Investors Wealth: రూ 2 లక్షల 71 కోట్ల సంపద నష్టం
మార్కెట్లో హ్యుండయ్ సరికొత్త వెన్యూ
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి