Investors Wealth: రూ 2 లక్షల 71 కోట్ల సంపద నష్టం
ABN , Publish Date - Nov 05 , 2025 | 06:19 AM
అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాల నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు పాల్పడటంతో పాటు విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ కారణంగా దేశీయ ఈక్విటీ...
సెన్సెక్స్ 519 పాయింట్లు పతనం
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాల నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు పాల్పడటంతో పాటు విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ కారణంగా దేశీయ ఈక్విటీ సూచీలు మంగళవారం భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 519.34 పాయింట్లు క్షీణించి 83,459.15 వద్దకు జారుకోగా.. నిఫ్టీ 165.70 పాయింట్లు కోల్పోయి 25,597.65 వద్ద ముగిసింది. ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.2.71 లక్షల కోట్లు తగ్గి రూ.469.80 లక్షల కోట్లకు పడిపోయింది.
నేడు మార్కెట్లకు సెలవు
గురునానక్ జయంతి సందర్భంగా బుధవారం స్టాక్ మార్కెట్లు బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈలకు సెలవు. ఫారెక్స్ మార్కెట్లు కూడా పనిచేయవు. గురువారం మార్కెట్లు యధావిధిగా పనిచేస్తాయి.
ఇవీ చదవండి:
ఈ పని చేయకుంటే.. జనవరి నుంచి పాన్ కార్డు డీయాక్టివేట్!
మెంబర్ పోర్టల్‌లోనే పాస్ బుక్.. ఈపీఎఫ్ఓ కొత్త ఫీచర్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి