Share News

PAN Card, Aadhaar Linking: ఈ పని చేయకుంటే.. జనవరి నుంచి పాన్‌ కార్డు డీయాక్టివేట్‌!

ABN , Publish Date - Nov 03 , 2025 | 05:24 PM

పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయమని అధికారులు అనేక సార్లు చెప్పారు. ఈ లింక్ చేసుకునేందుకు పలుసార్లు గడువు కూడా ఇచ్చారు. ఇప్పటికీ ఎవరైనా పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయించకుండా ఉంటే..త్వరగా చేసుకోవాలి. కారణం దీనికి 2025 డిసెంబర్ 31 వరకు గడువును ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించింది.

PAN Card, Aadhaar Linking: ఈ పని చేయకుంటే.. జనవరి నుంచి పాన్‌ కార్డు డీయాక్టివేట్‌!
PAN Card-Aadhaar Linking,

బిజినెస్ న్యూస్: పాన్‌కార్డ్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మన ఆర్థిక గుర్తింపులో ఈ కార్డు చాలా కీలకమైనది. ప్రధానంగా పన్ను రిటర్న్ లను దాఖలు చేయడం, బ్యాంకు అకౌంట్ లు ఓపెన్ చేయడం, పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగినప్పుడు.. ఈ పాన్ కార్డు(PAN Card) అవసరమవుతుంది. ఎవరైనా పన్నులకు సంబంధించిన పత్రాలను దాఖలు చేసే సమయంలో లేదా బ్యాంకు ఖాతాను తెరిచే సమయంలో ఆధార్‌(Aadhaar)తో పాన్ ను తప్పనిసరిగా లింక్ చేయాలి. అలా చేయకుంటే మీ పాన్ కార్డ్ డీయాక్టివేట్ అవుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..


పాన్ కార్డు(PAN Card)తో ఆధార్ లింక్ చేయమని అధికారులు అనేక సార్లు చెప్పారు. వీటిని లింక్ చేసుకునేందుకు పలుసార్లు గడువు కూడా ఇచ్చారు. ఇప్పటికీ ఎవరైనా పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయించకుండా ఉంటే..త్వరగా చేసుకోవాలి. కారణం దీనికి 2025 డిసెంబర్ 31 వరకు గడువు(PAN Aadhaar Deadline)ను ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించింది. ఈ తేదీ తర్వాత అంటే 2026 జనవరి 1 నుంచి మీ పాన్ కార్డ్ డియాక్టివేట్ అవుతుంది. ఒక చిన్న నిర్లక్ష్యం మీ ప్రధాన ఆర్థిక ప్రణాళికల(Financial News)కు ఆటంకం కలిగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక టైమ్ ఉంది కాబట్టి... పాన్ కార్డు, ఆధార్ లింక్ అనేది సకాలంలో పూర్తి చేయడం ఉత్తమం.


పాన్‌ కార్డుతో ఆధార్ లింక్ అయిందో లేదో చెక్ చేయండి ఇలా:

https://www.incometax.gov.in/iec పోర్టల్‌కి వెళ్లి “లింక్ ఆధార్ స్టేటస్” ఆప్షన్‌ను ఎంపిక చేయండి. అనంతరం పాన్(PAN Card), ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి. పాన్ ఆధార్‌తో లింక్ చేయబడిందో లేదో మీకు స్క్రీన్‌పై కనిపిస్తుంది. మీరు ఇంకా ఈ ముఖ్యమైన పని చేయకపోతే ఆలస్యం చేయకండి. ఈ ప్రక్రియ అనేది కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది. కానీ అలా చేయడంలో విఫలమైతే మీ పన్ను, బ్యాంకింగ్(Bankng), పెట్టుబడికి సంబంధించిన అన్ని పనులకు అంతరాయం కలుగుతుంది.


ఇవి కూడా చదవండి:

Maoist Party Letter: కాల్పుల విరమణపై మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం

Jogi Ramesh Brothers: జోగి రమేష్ బ్రదర్స్‌ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు

Updated Date - Nov 03 , 2025 | 08:21 PM