Hyundai Launches New Generation: మార్కెట్లో హ్యుండయ్ సరికొత్త వెన్యూ
ABN , Publish Date - Nov 05 , 2025 | 06:09 AM
హ్యుండయ్ మోటార్ కంపెనీ సరికొత్త హంగులతో తయారుచేసిన కాంపాక్ట్ ఎస్‌యూవీ వెన్యూను మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ.7.89 లక్షలు (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్). ఇది పెట్రోల్...
న్యూఢిల్లీ: హ్యుండయ్ మోటార్ కంపెనీ సరికొత్త హంగులతో తయారుచేసిన కాంపాక్ట్ ఎస్‌యూవీ వెన్యూను మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ.7.89 లక్షలు (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్). ఇది పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో మాన్యువల్, ఆటోమేటిక్ ఇంజన్లతో అందుబాటులో ఉంటుం ది. రూ.1,500 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేసిన ఈ కొత్త తరం వెన్యూ కారును కొత్తగా ప్రారంభించిన పుణె ప్లాంట్‌లోనే ఉత్పత్తి చేస్తామని త్వరలో ఎండీ, సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్న ప్రస్తుత చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ చెప్పారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే కార్లు దేశీయ అవసరాలకే కాకుండా 30 దేశాలకు కూడా ఎగుమతి చేస్తామని ఆయన తెలిపారు. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ఈ కారు మారుతి బ్రెజ్జా, టాటా నెక్సన్, కియా సోనెట్‌తో పోటీ పడుతుంది.
ఇవీ చదవండి:
ఈ పని చేయకుంటే.. జనవరి నుంచి పాన్ కార్డు డీయాక్టివేట్!
మెంబర్ పోర్టల్‌లోనే పాస్ బుక్.. ఈపీఎఫ్ఓ కొత్త ఫీచర్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి