Share News

Operation Sindoor: భారత్ దాడుల్లో 11 మంది సైనికులు మృతి: పాకిస్థాన్

ABN , Publish Date - May 13 , 2025 | 03:13 PM

Operation Sindoor: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటి వేళ పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఆ ఆపరేషన్‌లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు.

Operation Sindoor: భారత్ దాడుల్లో 11 మంది సైనికులు మృతి: పాకిస్థాన్

ఇస్లామాబాద్, మే 13: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్‌ల మధ్య వరుసగా నాలుగు రోజుల పాటు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 11 మంది సైనికులు మరణించారని పాకిస్థాన్ సైన్యం వెల్లడించింది. మరో 78 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపింది. వీరిలో సైనికులతో పాటు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది సైతం ఉన్నారని పాకిస్థాన్ ఆర్మీ వివరించింది. గాయపడిన వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పింది. ఈ మేరకు పాకిస్థాన్ ఆర్మీ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా సైనిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో దాదపు 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే ఆ ప్రాంతంలో ఉగ్రవాదులకు సంబంధించిన మౌలిక సదుపాయాలను సైతం ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో భారత్‌లోని పాకిస్థాన్ సరిహద్దునున్న రాష్ట్రాలకు చెందిన జిల్లాలపై పాకిస్థాన్ డ్రోనులు, క్షిపణులతో దాడులకు దిగింది. ఈ దాడులను భారత్ తిప్పికొట్టింది.


దాదాపు నాలుగు రోజుల పాటు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తల నడుమ శనివారం సాయంత్రం అంటే.. మే 10వ తేదీ ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించాయి. అయితే ఆ కొద్ది సేపటికి పాకిస్థాన్ మళ్లీ భారత్ భూభాగంలోని సైనిక స్థావరాలపై కాల్పులకు తెగబడింది. అనంతరం మళ్లీ అంటే సోమవారం రాత్రి సాంబా సెక్టార్‌లో కాల్పులకు తెగబడింది.


ఏప్రిల్ 22వ తేదీ జమ్మూ కశ్మీర్‌ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది మరణించారు. దీని వెనుక పాకిస్థాన్ ఉందనే బలమైన సాక్ష్యాలను భారత్ సంపాదించి.. ప్రపంచ దేశాల ముందు ఉంచింది. మరోవైపు.. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది.


అలాగే పాకిస్థాన్ సైతం అదే రీతిలో భారత్‌కు వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకుంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకున్నాయి. ఆ క్రమంలో భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహిస్తే.. పాకిస్థాన్ మాత్రం భారత్ భూభాగంపైకి ద్రోణులు, క్షిపణులు ప్రయోగించింది. వీటిని భారత్ తన ఆయుధ సంపత్తిలో అడ్డుకొంది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది.

ఈ వార్తలు కూడా చదవండి..

PM Modi: మోదీ సర్‌ప్రైజ్... ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో జవాన్లను కలిసిన ప్రధాని..

Terrorists Trapped: జుమ్మూలో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాదుల హతం

Operation Sindoor: అణువణువూ జల్లెడ పడుతున్న భారత్.. ఆచూకీ చెబితే 20 లక్షలు

For National News And Telugu News

Updated Date - May 13 , 2025 | 03:14 PM