DD Next Level Movie: శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తున్న మూవీపై పోలీసులకు ఫిర్యాదు
ABN , Publish Date - May 13 , 2025 | 05:39 PM
DD Next Level Movie: తిరుమలలోని శ్రీవెంకటేశ్వర స్వామి వారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా డిడి నెక్స్ట్ లెవల్ సినిమాలో పాట చిత్రీకరించడం పట్ల జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమైన విషయమని ఆయన తెలిపారు.
తిరుమల, మే 13: తిరుమలలో కొలువు తీరిన ఆ దేవదేవుడి శ్రీవెంకటేశ్వర స్వామి వారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా డిడి నెక్స్ట్ లెవల్ సినిమాలో పాట చిత్రీకరించడం పట్ల జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమైన విషయమని ఆయన తెలిపారు. ఈ తమిళ సినిమాపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కిరణ్ రాయల్ వెల్లడించారు. మంగళవారం తిరుపతిలో జనసేన నేత కిరణ్ రాయల్ విలేకర్లతో మాట్లాడుతూ.. తమిళనాడులో ఉన్న ప్రభుత్వం నాస్తికుల ప్రభుత్వమని గుర్తు చేశారు.
తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్, ఆయన తనయుడు కళానిధి మారన్ నాస్తికులని గుర్తు చేశారు. వారు దేవుణ్ణి నమ్మరని చెప్పారు. ఇది ఒక విధంగా హిందువులపై దాడి చెయ్యడమేనని ఆయన అభివర్ణించారు. మే 15వ తేదీన ఈ చిత్రం విడుదల అవుతుందన్నారు. దీనిని అక్కడి ప్రజా ప్రతినిధులతోపాటు శ్రీవారి భక్తులు సైతం అడ్డుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు.
ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు సీరియస్‌గా పరిగణించాలని సూచించారు. అలాగే ఈ చిత్రం విడుదలకు అనుమతి ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వంతోపాటు సెన్సార్ బోర్డుపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Operation Sindoor: భారత్ దాడుల్లో 11 మంది సైనికులు మృతి: పాకిస్థాన్
Operation Sindoor: నుదుటి సిందూరం తుడిచినవాని నట్టింట్లోకి వెళ్లి నాశనం చేశాం
Vallabhaneni Vamsi: వంశీని ఆసుపత్రికి తరలించిన పోలీసులు
For AndhraPradesh News And Telugu news