Turkey: బ్యాన్ తుర్కియే
ABN , Publish Date - May 14 , 2025 | 06:03 AM
భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో తుర్కియే పాకిస్థాన్‌కు మద్దతు ఇచ్చినందుకు దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. ఈ నిరసనలతో పుణెలో వ్యాపారులు తుర్కియే నుంచి వచ్చే యాపిల్స్‌ను బహిష్కరించి, ఇతర దేశాల నుంచి వాటిని దిగుమతి చేస్తున్నారు.
ఆ దేశం నుంచి వచ్చే యాపిల్స్ వద్దన్న పుణె వ్యాపారులు
మే 13: భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ తుర్కియే పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వడం పట్ల దేశంలో తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. దేశవ్యాప్తంగా బ్యాన్ తుర్కియే ఉద్యమం ఊపందుకుంది. తాజాగా పుణెలో పలువురు వ్యాపారులు ఆ దేశం నుంచి వచ్చే యాపిల్స్‌ను పూర్తిగా బహిష్కరించారు. ప్రస్తుతం అక్కడి మార్కెట్లలో తుర్కియే నుంచి దిగుమతి అయిన యాపిల్స్ కనిపించడంలేదు. బదులుగా హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఇరాన్ దేశాల నుంచి వాటిని వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. ఏటా పుణె మార్కెట్‌లో తుర్కియే నుంచి వచ్చిన యాపిల్స్ మార్కెట్ విలువ వందల కోట్లలో ఉంటుందని అంచనా.
ఈ వార్తలు కూడా చదవండి..
Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్
CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..