ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Golden Temple: దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్.. చీకట్లో గోల్డెన్ టెంపుల్..

ABN, Publish Date - May 08 , 2025 | 11:37 AM

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో లైట్లు ఆర్పేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ఆర్మీ .. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై బుధవారం వేకువజాము విరుకుపడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. భారత్ దాడిని జీర్ణించుకోలేని పాకిస్తాన్ ఆర్మీ సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాలపై కాల్పులకు తెగబడుతోంది. అయితే భారత ఆర్మీ వారికి దీటైన సమాధానం ఇస్తోంది. మరోవైపు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో లైట్లు ఆర్పేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


మాక్ డ్రిల్‌లో (Mock drill) భాగంగా పంజాబ్‌లోని (Punjab) పలు ప్రాంతాల్లో విద్యుత్‌ను నిలిపేశారు. ఇందులో భాగంగా అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో (Golden Temple) బుధవారం సాయంత్రం లైట్లను ఆర్పేశారు. ప్రజల భద్రతతో పాటూ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా అమృత్‌సర్ జిల్లా వ్యాప్తంగా బ్లాక్‌అవుట్ చర్యలను చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. రాత్రి 10:30 నుంచి 11 గంటల మధ్య లైట్లను ఆర్పివేసినట్లు చెప్పారు. శత్రువులకు ఇక్కడ ఒక నగరం ఉందని తెలియకుండా ఉండేందుకు ఇలా చేస్తున్నట్లు తెలిపారు. సైరన్ మోత వినిపించిన రెండు నిముషాల వ్యవధిలో నగరం మొత్తం లైట్లను ఆర్పేశారు. ఈ బ్లాక్అవుట్ కార్యక్రమాన్ని రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల్లో నిర్వహించారు. అలాగే ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్, విజయ్ చౌక్ వంటి చారిత్రక ప్రదేశాలు కూడా చీకటిలోకి వెళ్లిపోయాయి.


పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని 9 ఉగ్ర స్థావరాలపై దాడి చేసింది. ఈ దాడుల్లో మొత్తం 70 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. అలాగే మరో 60 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. దాదాపు 25 నిమిషాల పాటు జరిగిన ఈ ఆపరేషన్‌లో సరిహద్దులకు 100 కిలోమీటర్ల దూరంలోని బవహల్పూర్‌ జైషే క్యాంప్‌ సహా పలు స్థావరాలను నేల మట్టం చేసింది. పంజాబ్‌ ప్రావిన్స్‌లోనే నాలుగు టెర్రర్‌ క్యాంప్‌లను నేలమట్టం చేసింది. భారత ఆర్మీ మెరుపు దాడులతో పాకిస్తాన్‌లోని లాహోర్, సియాల్‌కోట్ విమానాశ్రయాలను 48 గంటల పాటు మూసివేస్తున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే..

పాక్ కవ్వింపు చర్యలు.. తిప్పికొట్టిన భారత్ సైన్యం..

న్యాయం జరిగింది: సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కుటుంబం

For More AP News and Telugu News

Updated Date - May 08 , 2025 | 03:18 PM