ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Operation Sindoor: యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్.. ఎలా పని చేస్తుందంటే..

ABN, Publish Date - May 09 , 2025 | 12:03 PM

పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పే క్రమంలో ఇండియన్ ఆర్మీ పాక్ భూభాగంలోని ఆర్మీ పోస్టులపై దాడులు చేసింది. యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో ఈ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తికనబరుస్తున్నారు. ఇది ఎలా పని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆపరేషన్ సిందూర్‌తో భారత్-పాక్ మధ్య ఏ క్షణం ఏం జరుగుతుందో తెలీని పరిస్థితి నెలకొంది. మరోవైపు పాకిస్తాన్ కూడా నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరుపుతూ తన అక్కసును వెల్లగక్కుతోంది. అయితే పాక్ కవ్వింపు చర్యలకు ఇండియన్ ఆర్మీ దీటుగా సమాధానం ఇస్తోంది. పాక్ దుశ్చర్యలకు మరింత దీటుగా సమాధానం ఇచ్చే క్రమంలో సరిహద్దుల్లోని పాక్ సైనిక పోస్టులను ధ్వంసం చేశారు. యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణితో వాటిని పేల్చేసినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. దీంతో ఈ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తికనబరుస్తున్నారు.


పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పే క్రమంలో ఇండియన్ ఆర్మీ (Indian Army) పాక్ భూభాగంలోని ఆర్మీ పోస్టులపై దాడులు చేసింది. యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. అయితే ప్రస్తుతం అంతా ఆ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి పనితనం గురించి చర్చించుకుంటున్నారు. యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ (ATGM) అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణిని ప్రధానంగా ట్యాంకులు, ఇతర సాయుధ వాహనాలను నాశనం చేయడానికి ఉపయోగిస్తారు. ఇవి ఒక లక్ష్యంపైకి వెళ్లి, టార్గెట్‌ను ఛేందించేందుకు వీలుగా మార్గనిర్దేశం చేయబడతాయి. వీటిని కమాండ్ గైడెన్స్ లేదా లేజర్ గైడెన్స్ ద్వారా మార్గనిర్దేశం చేస్తుంటారు. వీటిని భుజంపై నుంచి, లేదా వాహనాలు, విమానాల నుండి కాల్చుతుంటారు. సైనికులు సురక్షితమైన దూరంలో ఉంటూ శత్రు స్థావరాలను ధ్వంసం చేసేందుకు ఈ క్షిపణులను వినియోగిస్తుంటారు.


ఎలా పని చేస్తాయంటే..

యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణుల్లో ప్రత్యేకమైన పేలుడు పదార్థాన్ని వినియోగిస్తారు. ఇది దాని శక్తినంతా ఒకే దిశలో కేంద్రీకరిస్తుంది. ఈ క్షిపణి మందపాటి ట్యాంక్ కవచాన్ని కూడా ఛేదించగలిగేంత బలంగా ఉంటుంది. ప్రస్తుతం కొన్ని ఆధునిక ATGM లలో టెన్డం వార్‌హెడ్‌లను ఉపయోగిస్తుంటారు. ఇందులో ఎంపీఏటీజీఎం, లాంచర్, టార్గెట్ అక్విజిషన్ ఎక్విప్‌మెంట్, ఫైర్ కంట్రోల్ యూనిట్‌లు ఉంటాయి. ఈ యాంటీ ట్యాంక్ క్షిపణి వ్యవస్థను పగలు, రాత్రి సమయాల్లోనూ వినియోగించవచ్చు. కొన్నింటిలో టాప్-అటాక్ మోడ్‌ సిస్టం ఉంటుంది. శత్రు దుర్భేద్యంగా ఉన్న లక్ష్యాలను పైనుంచి టార్గెట్‌ను ఛేదించే సామర్థ్యం వీటికి ఉంటుంది. ప్రస్తుతం 130కి పైగా దేశాలు ATGMలను ఉపయోగిస్తున్నాయి. ఇటీవల జరిగిన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలోనూ వీటిని విస్తృతంగా ప్రయోగించారు.


భారత్‌పై పాకిస్తాన్ ప్రతీకార దాడులకు తెగపడుతుండడంతో భారత్ వాటిని తిప్పికొట్టే పనుల్లో నిమగ్నమైంది. రాజస్తాన్‌లోని జైసల్మేర్ నగరంపై పాక్ డ్రోన్లు, మిసైల్స్ దాడికి తెగబడ్డాయి. అయితే వాటిని భారత సైన్యం విజయవంతంగా నిర్వీర్యం చేసింది. ఈ క్రమంలో మొత్తం 24 ఎయిర్‌పోర్టులను మూసేసింది. ఛండీఘర్, శ్రీనగర్, అమృత్ సర్, లుధియానా, షిమ్లా, జోద్‌పూర్, జమ్మూ, పఠాన్‌కోట్ ఎయిర్‌పోర్టులను మూసేసింది. అలాగే సరిహద్దు జిల్లాల్లోని అన్ని స్కూళ్లకూ సెలవులు ప్రకటించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

యుద్ధ వాతావరణం.. సైరన్లు మోగుతున్నాయి...

అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..

For More AP News and Telugu News

Updated Date - May 09 , 2025 | 12:38 PM