Bypolls: నాలుగు రాష్ట్రాల్లోని 5 నియోజవర్గల్లో ఉప ఎన్నికలను ప్రకటించిన ఈసీ
ABN, Publish Date - May 25 , 2025 | 05:50 PM
గుజరాత్‌లో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు, కేరళ, పశ్చిమబెంగాల్, పంజాబ్‌లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగనున్నాయి.
న్యూఢిల్లీ: గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమబెంగాల్‌లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల (Bypolls) తేదీని భారత ఎన్నికల కమిషన్ (ECI) ఆదివారంనాడు ప్రకటించింది. ఉపఎన్నికల పోలింగ్ జూన్ 19న నిర్వహించి, జూన్ 23న ఫలితాలు వెల్లడించనున్నట్టు తెలిపింది. గుజరాత్‌లో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు, కేరళ, పశ్చిమబెంగాల్, పంజాబ్‌లో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగనున్నాయి.
Lalu Expels Tej Pratap: ఆర్జేడీ నుంచి తేజ్ ప్రతాప్ బహిష్కరణ.. లాలూ సంచలన నిర్ణయం
గుజరాత్‌లో కడీ, విసావ్‌దార్‌లో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. కడీలో సిట్టింగ్ ఎమ్మెల్యే హర్షాన్‌భాయ్ పుంజాబాయ్ సోలింకి మరణంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. విసావ్‌దార్‌లో సిటింగ్ ఎమ్మెల్యే భూపేంద్రభాయ్ గండుభాయ్ రాజీనామా చేయడంతో అక్కడ ఉపఎన్నిక జరుగుతోంది. కేరళలోని నీలాంబర్ నియోజకవర్గంలో పీవీ అన్వర్ రాజీనామా చేయడం, పంజాబ్‌లోని లూథియానాలో సిట్టింగ్ ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ బస్సీ గోగి మరణంతో అక్కడ ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. పశ్చిమబెంగాల్‌లోని కాలిగంజ్ సీటుకు సిట్టింగ్ ఎమ్మెల్యే నసురుద్దీన్ అహ్మద్ మృతితో ఉపఎన్నిక జరుగనుంది.
గుజరాత్ ఉప ఎన్నికల్లో సోలోగా కాంగ్రెస్
కాగా, కడి, విసావ్‌దార్ నియోజకవర్గాల్లో 'ఇండియా' కూటమి భాగస్వామి ఆప్‌తో పొత్తు లేకుండా స్వతంత్రంగా పోటీ చేస్తామని గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శక్తిసిన్హ్ గోహిల్ తెలిపారు. రాష్ట్రంలో గత ఎన్నికల ట్రెండ్స్‌ను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కాగా, పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా భరత్ భూషణ్ అషును కాంగ్రెస్ ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
NDA CMs, Deputy CMs Meet: ఆపరేషన్ సింధూర్ విజయంపై మోదీని అభినందిస్తూ తీర్మానం
Mann ki Baat: తెలంగాణ డ్రోన్ దీదీలపై ప్రధాని మోదీ ప్రశంసలు
Shashi Tharoor: పార్టీ కోసమే పని చేస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన శశిథరూర్
For National News And Telugu News
Updated Date - May 25 , 2025 | 05:55 PM