ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ayodhya Ram Mandir: జూన్ 5న రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ..

ABN, Publish Date - May 21 , 2025 | 07:40 PM

అయోధ్య రామాలయ మొదటి అంతస్తులోని రామ దర్బార్‌ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని జూన్ 5న నిర్వహించనున్నట్లు శ్రీరామ జన్మభూమి నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఈలోపు రామమందిర నిర్మాణం పూర్తవుతుందని, జూన్ 3 నుండి 5 వరకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు.

అయోధ్య రామాలయ మొదటి అంతస్తులోని రామ దర్బార్‌ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని జూన్ 5న నిర్వహించనున్నట్లు శ్రీరామ జన్మభూమి నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఈలోపు రామమందిర నిర్మాణం పూర్తవుతుందని, జూన్ 3 నుండి 5 వరకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ పవిత్రోత్సవానికి వివిధ మతాలకు చెందిన ఆధ్యాత్మిక నాయకులను ఆహ్వానించన్నట్లు చెప్పారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వీఐపీలు, రాజకీయ నాయకులు ఎవరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదని ఆయన స్పష్టం చేశారు. రామదర్బార్‌‌లో రాముడు, సీత, లక్ష్ణణుడు తదితర దేవుళ్లను దర్శించుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు.


జూన్ 3నుంచి 5 వరకు మతపరమైన కార్యక్రమాలు (Ayodhya Ram Mandir) జరుగుతాయని, ఆ తర్వాత భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఆలయ నిర్మాణం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యాలు లేవని.. సుమారు 500 సంవత్సరాలకు పైగా పోరాటం తర్వాత ఈ క్షణం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు అయోధ్యలో రామ్ పథ్, భక్తి పథ్, జన్మభూమి పథ్‌లను అభివృద్ధి చేసిన తర్వాత.. అయోధ్యలో 20 కిలోమీటర్ల పొడవైన భారత్ పథ్ నిర్మించన్నారు. రూ.900 కోట్లతో ఈ ప్రాజెక్ట్ పనులు చేపట్టనున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.


ఇవి కూడా చదవండి

CM Chandrababu Yoga Day: ప్రపంచానికి భారత్ అందిస్తున్న వరం యోగా

Vizianagaram Terror Suspects: ఉగ్రలింకుల కేసులో ఎన్‌ఐఏ దూకుడు

Read Latest National News And Telugu News

Updated Date - May 21 , 2025 | 08:27 PM