CM Chandrababu Yoga Day: ప్రపంచానికి భారత్ అందిస్తున్న వరం యోగా
ABN , Publish Date - May 21 , 2025 | 11:03 AM
CM Chandrababu Yoga Day: ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరం యోగా అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఫొటోలు, ఈవెంట్ కోసం ఒక రోజు చేసే కార్యక్రమం కాదన్నారు. ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైన మార్పు తీసుకొచ్చే కార్యక్రమం యోగా అని తెలిపారు.

అమరావతి, మే 21: 11వ యోగా ఇంటర్నేషనల్ డేను (Yoga International Day) ఆంధ్రప్రదేశ్‌లో (Andhrapradesh) ఘనంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. నాగరికతకు భారతదేశం పెట్టింది పేరన్నారు. యోగా మన వారసత్వమని.. యోగా ఇంటర్నేషనల్ డేగా గుర్తింపు రావడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) కారణమన్నారు. యోగా మెరుగైన జీవనానికి దోహద పడుతుందని తెలిపారు. నేడు ప్రపంచంలో అన్ని దేశాల్లో జరుపుకునే కార్యక్రమం యోగా అని చెప్పుకొచ్చారు. యోగా అనేది కొద్దిమందికో లేక.. కొన్ని ప్రాంతాలకో సంబంధించింది కాదన్నారు.
Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు
అందరి జీవితాల్లో యోగా అనేది ఒక భాగం కావాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరం యోగా అని చెప్పుకొచ్చారు. ఫొటోలు, ఈవెంట్ కోసం ఒక రోజు చేసే కార్యక్రమం కాదన్నారు. ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైన మార్పు తీసుకొచ్చే కార్యక్రమం యోగా అని తెలిపారు. యోగా దినోత్సవాన్ని ప్రధాని మోదీ ఒక దీక్ష , పట్టుదలతో చేస్తున్నారన్నారు. నేటి (బుధవారం) నుంచి నెల రోజుల పాటు యోగాంధ్ర -2025పేరుతో ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది పాల్గొనేలా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. 5 లక్షల మందితో వచ్చే నెల 21 తేదీన యోగా డే నిర్వహిస్తామని.. ఉదయం 7 నుంచి 8 గంటల వరకూ విశాఖపట్నం రామకృష్ణ బీచ్‌లో యోగ డే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 10 లక్షల మందికి యోగా సర్టిఫికెట్ ఇస్తామన్నారు.
యోగా వల్ల తనకు మానసిక ప్రశాంత ఏర్పడిందని ముఖ్యమంత్రి అన్నారు. అనేక స్వచ్ఛంద సంస్థలు యోగాను ప్రమోట్ చేస్తున్నాయని తెలిపారు. 27 జిల్లాలో నెల రోజులపాటు యోగాంధ్ర పేరుతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మీడియా సైతం యోగాను ప్రమోట్ చేసేందుకు కృషి చేయాలని కోరారు. 2,500 మందిని మాస్టర్ ట్రైనర్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
కాగా.. విజయవాడ హరిత బెరంపార్కులో యోగాంధ్ర జనజాగృతి కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. మే 21 నుంచి జూన్ 21 వరకు నెల రోజులపాటు యోగాంధ్ర ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కనీసం రెండు కోట్ల మంది యోగాలో ప్రవేశించేలా అవగాహన, శిక్షణ ఇవ్వనున్నారు. నిపుణులు రూపొందించిన యోగా కామన్ ప్రోటోకాల్ ప్రకారం శిక్షణ, అభ్యాసం చేస్తారు. యోగాలో శిక్షణ పొందిన కనీసం 20 లక్షల మందికి సర్టిఫికెట్ల జారీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 100 పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూన్ 21న విశాఖ ఆర్‌కే బీచ్‌లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో, వార్డు స్థాయిలో ప్రజలకు యోగా ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తామని.. ప్రతిఒక్కరూ తమ జీవన మార్గంలో యోగా అభ్యసనాన్ని భాగం చేసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమం) ఎంటీ కృష్ణబాబు తెలిపారు. యోగాంధ్ర మాసోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ, ఆయుష్ డైరెక్టర్ కె.దినేష్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, యోగా ఔత్సాహికులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
COVID-19: ఆసియాలో కోరలు చాస్తున్న కొవిడ్
Vizianagaram Terror Suspects: ఉగ్రలింకుల కేసులో ఎన్‌ఐఏ దూకుడు
Read Latest AP News And Telugu News