Supreme Court: బిహార్ ఓటరు సవరణపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ABN, Publish Date - Aug 13 , 2025 | 03:48 PM
ఎస్‌ఐఆర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్ విచారణ కొనసాగించారు. గతంలో బీహార్‌లో నిర్వహించిన సమ్మరీ రివిజన్‌లో ఏడు ధ్రువపత్రాలను మాత్రమే అనుమతించారని పేర్కొన్నారు.
ఢిల్లీ: బిహార్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై సుప్రీంకోర్టులో వాడీవేడీ వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. గుర్తింపు కార్డులపై ఈసీ నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈసీ 11 గుర్తింపు పత్రాలను ఆమోదించడం.. ఓటరుకు ప్రయోజకరంగానే ఉందని తెలిపింది. 11 ధ్రువపత్రాల్లో ఒక్క డాక్యుమెంట్ చూపించినా సరిపోతుందని చెప్పుకొచ్చింది.
ఎస్‌ఐఆర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్ విచారణ కొనసాగించారు. గతంలో బీహార్‌లో నిర్వహించిన సమ్మరీ రివిజన్‌లో ఏడు ధ్రువపత్రాలను మాత్రమే అనుమతించారని పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్‌లో మాత్రం 11 డాక్యుమెంట్లను అనుమతించడం చూస్తుంటే ఓటరుకు అనుకూలంగానే కనిపిస్తోందన్నారు. ఆధార్ అనుమతించడం లేదనే పిటిషనర్ల వాదనను అర్థం చేసుకున్నప్పటికి అనేక డాక్యుమెంట్లను వాస్తవానికి పరిగణనలోకి తీసుకుంటున్నారని అని ధర్మాసనం పేర్కొంది.
అనంతరం పిటిషన్ తరుఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ తన వాదనలు వినిపించారు. ధ్రువపత్రాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ అవి అందరికీ అందుబాటులో లేవన్నారు. రాష్ట్రంలో కేవలం రెండు శాతం మంది దగ్గర మాత్రమే ఇవి ఉన్నాయని పేర్కొన్నారు. ఆయా ప్రభుత్వ విభాగాల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్న తర్వాతే ధ్రువపత్రాల జాబితా రూపొందిస్తారని తెలిపారు. ఇదే అంశంపై నిన్న(ఆగస్టు 12) వాదనలు విన్న ధర్మాసనం పౌరసత్వానికి సాక్ష్యాలుగా ఆధార్, ఓటరు ఐడీ కార్డులను పరిగణనలోకి తీసుకోలేమన్న ఈసీ వాదనలతో ఏకీభవించిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
మరుగుదొడ్డిలో 16 అడుగుల కింగ్ కోబ్రా
నేడు దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Updated Date - Aug 13 , 2025 | 03:50 PM