Heavy Rains: న్యూఢిల్లీలో రెడ్ అలర్ట్..విమాన సర్వీసులపై ఎఫెక్ట్
ABN, Publish Date - May 02 , 2025 | 09:13 AM
Heavy Rains: ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా.. దేశ రాజధాని న్యూఢిల్లీ చిగురుటాకులా వణికింది. ద్వారకాలోని ఒక ఇంటిపై చెట్టు కూలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల వల్ల పలు విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
న్యూఢిల్లీ, మే 02: ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా దేశ రాజధాని న్యూఢిల్లీ చిగురాటకులా వణుకుతోంది. ఈదురుగాలులు, వర్షాల కారణంగా ద్వారకాలోని ఒక ఇంటిపై చెట్టు కూలింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో మహిళతోపాటు ముగ్గురు చిన్నారులున్నారు. భారీ వర్షాల కారణంగా.. ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు న్యూఢిల్లీ మహానగరంలో రహదారులపైకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో ఈ ప్రభావం 100 విమాన సర్వీసులపై పడింది. ఈ కారణంగా విమాన సర్వీసుల రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
అయితే భారీ వర్షాలు కారణంగా.. ఢిల్లీకి రావాల్సిన మూడు విమాన సర్వీసులను దారి మళ్లీంచామని ఎయిర్ పోర్ట్ అధికారులు వెల్లడించారు. దీంతో ఆ యా సర్వీసులు అహ్మదాబాద్, జైపూర్ వైపునకు మళ్లిస్తున్నామన్నారు. బెంగళూరు-ఢిల్లీతోపాటు పుణె -ఢిల్లీ విమాన సర్వీసులను ఇప్పటికే జైపూర్‌కు మళ్లించామని తెలిపారు. ఢిల్లీకి రావలసిన విమాన సర్వీసులు దాదాపు 21 నిమిషాల ఆలస్యంగా చేరుకొంటున్నాయని.. అలాగే న్యూఢిల్లీ నుంచి గంట ఆలస్యంగా విమానాలు బయలుదేరుతోన్నాయని ఎయిర్‌పోర్ట్ అధికారులు వివరించారు.
వాతావరణ పరిస్థితులు దాదాపుగా ప్రతికూలంగా మారడంతో విమాన సర్వీసుల రాకపోకలకు తీవ్ర అంత రాయం ఏర్పడిందని.. ఈ నేపథ్యంలో తమ ప్రయాణ షెడ్యుల్‌ను చూసుకొని కాస్తా ముందుగా బయలుదేరాలని ప్రయాణికులు ఎయిర్ పోర్ట్ అధికారులు సూచించారు.
విమాన షెడ్యూల్‌పై ఇది తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపింది. ఇక ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయిద. ద్వారక, ఖాన్‌పూర్, సౌత్ ఎక్సెటెన్షన్ రింగ్ రోడ్డు, మింటో రోడ్డు, లజ్‌పత్ నగర్, మోటి బాగ్ తదితర ప్రాంతాలు జలమయమైనాయి. ఈదురుగాలుల కారణంగా.. పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నెలకొరిగాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే కానీ ఇంటి నుంచి బయటకు రావద్దని అధికారులు స్పష్టం చేశారు.
మరోవైపు ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. 19.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయిందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. 70 నుంచి 80 కి.మీ వేగంగా భారీ గాలులు వీస్తున్నాయని తెలిపింది. ఇక ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశలలో సాధారణ వర్షం కురుస్తోందని తెలిపింది. ఇక మరికొన్ని రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశముంది. ఈ నేపథ్యంలో శనివారం వరకు న్యూఢిల్లీలో రెడ్ అలర్ట్‌ను వాతావరణ విభాగం ప్రకటించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Pakistan Vs India: పాకిస్థాన్‌కు గట్టిగా బదులిస్తున్న భారత్
Ambulance: అంబులెన్స్‌లో ఏం తరలిస్తున్నారో తెలిస్తే.. షాక్ అవాక్కవాల్సిందే..
Pahalgam Terror Attack: హఫీజ్ సయిద్ భద్రత పెంచిన పాక్
For National News And Telugu News
Updated Date - May 02 , 2025 | 10:28 AM