Home » Delhi Airport
ఢిల్లీ విమానాశ్రయంలో జీపీఎస్ స్పూఫింగ్‌పై వైసీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానం ఇచ్చారు. ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో జీపీఎస్ స్పూఫింగ్ జరిగిందని ఫ్లైట్స్ రిపోర్ట్స్ వచ్చాయని.. కంటెంజెన్సీ ప్రొసీజర్స్ ద్వారా ఈ పరిస్థితిని అధిగమించాయని తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మిక వర్షాలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై భారీగా వర్షం నీరు చేరి ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. దీంతో విమానాల రాకపోకలపై కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది.
హాంకాంగ్ నుండి ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో ల్యాండ్ అయిన కొద్దిసేపటికే మంటలు వ్యాపించాయి. దీంతో ఎయిర్‌లైన్ నిర్వహణ, విమానాల తనిఖీలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Air India Crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి ముందు పైలెట్ మాట్లాడిన చివరి మాటలకు సంబంధించిన ఆడియో బయటకు వచ్చింది.
ప్రయాణికులకు పెద్దగా అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసి కొన్ని విమాన సర్వీసులను మాత్రమే తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు డీఐఏఎల్ సీఈవో కుమార్ జైపురియార్ తెలిపారు. ప్రతిరోజూ 1,450 విమాన సర్వీసులు నడున్నాయని, వీటిలో 114 ఆపరేషన్లను రద్దు చేస్తున్నామని చెప్పారు.
బీజేపీని ఎందుకు విమర్శించటం లేదని పార్టీ మహిళా నేత.. మరో పక్క సొంత చెల్లెలైన కల్వకుంట్ల కవిత లేఖాస్త్రం ఎఫెక్టో.. మరొకటో కాని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ బీజేపీని టార్గెట్ చేశారు.
ఢిల్లీలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా హస్తినలో ఏడుగురు మృతి చెందగా, 50 మందికి పైగా గాయాలయ్యాయి. విమానాలకు అంతరాయం ఏర్పడింది. కూలిన చెట్లు, వీధులు జలమయంతో పరిస్థితి చిన్నాభిన్నంగా ఉంది.
Heavy Rains: ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా.. దేశ రాజధాని న్యూఢిల్లీ చిగురుటాకులా వణికింది. ద్వారకాలోని ఒక ఇంటిపై చెట్టు కూలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల వల్ల పలు విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ డ్రగ్స్ అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. పలు రకాల పద్ధతుల్లో డ్రగ్స్ రవాణా చేస్తూ దొరికిపోతున్నారు. ఆ క్రమంలోనే తాజాగా అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్‌వర్క్ నిందితులు పట్టుబడ్డారు. వారి నుంచి ఏకంగా సుమారు రూ. 40 కోట్ల విలువైన డ్రగ్స్ లభ్యమైంది.
Gold Robbery: ఢిల్లీ ఎయిర్ పోర్టులో అనుమానాస్పందగా తిరుగుతున్న ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వారి దగ్గరి నుంచి బారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారుల విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి.