Share News

Heavy Rains Delhi: ఢిల్లీలో కుండపోత వర్షం.. ట్రాఫిక్ ఇబ్బందులు, విమానాల ఆలస్యం

ABN , Publish Date - Aug 25 , 2025 | 10:57 AM

దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మిక వర్షాలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై భారీగా వర్షం నీరు చేరి ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. దీంతో విమానాల రాకపోకలపై కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది.

Heavy Rains Delhi: ఢిల్లీలో కుండపోత వర్షం.. ట్రాఫిక్ ఇబ్బందులు, విమానాల ఆలస్యం
Heavy Rains Delhi

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు మళ్లీ వానలు దంచి (Heavy Rains Delhi) కోడుతున్నాయి. దీంతో ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై నీరు భారీగా చేరడంతో ట్రాఫిక్ జామ్‌, విమానాల ఆలస్యం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వీకెండ్ నుంచి షురూ అయిన వర్షం సోమవారం ఉదయం కూడా కొనసాగింది. దీంతో ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్ లాంటి ఎయిర్‌లైన్స్ తమ ప్రయాణీకులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశాయి.


ప్రయాణించే ముందు..

ఈ క్రమంలో స్పైస్‌జెట్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ ఢిల్లీలో భారీ వర్షం కారణంగా విమానాలు ఆలస్యం కావచ్చని తెలిపింది. మీరు ప్రయాణించే ముందు ఫ్లైట్ స్టేటస్‌ను చెక్ చేసుకోవాలని తెలిపింది. ఇండిగో కూడా ఇదే బాటలో పయనిస్తూ ఈ రోజు వర్షం వల్ల ఢిల్లీలో రోడ్లు బ్లాక్ అయ్యాయి, ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరే ముందు మీ ఫ్లైట్ స్టేటస్ చూసుకోండి. వీలైతే ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సలహా ఇచ్చింది.


ఈ ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం..

ఎయిర్ ఇండియా కూడా ఈ రోజు ఢిల్లీలో వర్షం వల్ల విమానాలపై ప్రభావం పడొచ్చు, ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని ఎక్స్‌లో తెలిపింది. మనం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆదివారం నుంచే ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వర్షం దంచికొడుతోంది. ప్రీత్ విహార్, రాజీవ్ చౌక్, ఐటీఓ, జఫర్‌పూర్, ఇండియా గేట్, అక్షర్‌ధామ్, సఫ్దర్‌జంగ్, లోడీ రోడ్‌లాంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నెహ్రూ స్టేడియం, డిఫెన్స్ కాలనీ, లజ్‌పత్ నగర్, కల్కాజీ, ఆయానగర్, డేరామండీలో కూడా వర్షం పడింది. ఈ వర్షం వల్ల రోడ్లు నీటితో నిండిపోయి, ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి.


ఎలాంటి ఇబ్బందులు..

ఢిల్లీలో ఉన్నవాళ్లు, ముఖ్యంగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాలనుకునే వారు కాస్త జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవడం, ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముందుగానే బయల్దేరడం మంచిది. వీలైతే ప్రత్యామ్నాయ రూట్లను ఎంచుకోవాలన్నారు. మీరు ఢిల్లీలో ఉంటే, ఈ వర్షం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో కామెంట్‌ రూపంలో తెలియజేయండి.


ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 25 , 2025 | 11:05 AM