Share News

Team India New Sponsor:టీమ్ ఇండియాకు కొత్త స్పాన్సర్‌ షిప్.. పోటీలో టయోటా, ఫిన్‌టెక్ స్టార్టప్

ABN , Publish Date - Aug 25 , 2025 | 10:26 AM

టీమ్ ఇండియాకు స్పాన్సర్‌షిప్ ఇవ్వడం అంటే ఆయా కంపెనీలు బాగా పేరు సంపాదించుకుంటాయని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం డ్రీమ్11 త్వరలో టీమ్ ఇండియాకు స్పాన్సర్ చేయడం ఆపేయనుంది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Team India New Sponsor:టీమ్ ఇండియాకు కొత్త స్పాన్సర్‌ షిప్.. పోటీలో టయోటా, ఫిన్‌టెక్ స్టార్టప్
Teamindia New Sponsor

టీమ్ ఇండియా క్రికెట్‌కు సంబంధించి ఒక హాట్ హాట్ న్యూస్ వచ్చేసింది. మన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి టైటిల్ స్పాన్సర్‌గా ఉన్న డ్రీమ్11 (Teamindia New Sponsor) తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇకపై టీమ్ ఇండియాకు స్పాన్సర్ చేయమని చెప్పింది. దీంతో BCCI కొత్త స్పాన్సర్ కోసం వేట మొదలెట్టింది.

ఈ క్రమంలోనే సెప్టెంబర్ 9 నుంచి యూఏఈలో జరగబోయే ఆసియా కప్‌కి ముందు ఈ స్పాన్సర్‌షిప్ హడావిడి మొదలైంది. డ్రీమ్11 ఎందుకు వెనక్కి తగ్గిందంటే, ఇటీవల పార్లమెంట్‌లో ఆన్‌లైన్ గేమింగ్ రెగ్యులేషన్ బిల్ ఆమోదం పొందింది. ఈ బిల్ కారణంగా డ్రీమ్11 BCCIకి తమ నిర్ణయాన్ని తెలియజేసింది.


పోటీలో రెండు

ఈ క్రమంలో రెండు పెద్ద సంస్థలు టీమ్ ఇండియాకు స్పాన్సర్‌ కోసం ముందుకొచ్చాయని నివేదికలు చెబుతున్నాయి. వాటిలో ఒకటి టయోటా మోటార్ కార్పొరేషన్, రెండోది ఒక ఫిన్‌టెక్ స్టార్టప్. టయోటా లాంటి గ్లోబల్ బ్రాండ్, ఇంకోవైపు కొత్తగా ఊపందుకుంటున్న ఫిన్‌టెక్ స్టార్టప్ ఈ రెండూ రేసులో ఉన్నాయి. కానీ ఇంకా అధికారిక టెండర్ ప్రాసెస్ మొదలు కాలేదు.


జెర్సీలు మాత్రం..

ఇక ఆసియా కప్ జెర్సీల విషయానికొస్తే, డ్రీమ్11 లోగోతో జెర్సీలు ఇప్పటికే ప్రింట్ అయిపోయాయట. కానీ, ఈ కొత్త అప్‎డేట్ కారణంగా ఆ జెర్సీలు ఆసియా కప్‌లో ఉపయోగించరు. ఇప్పుడు BCCI కొత్త స్పాన్సర్ లోగోతో జెర్సీలు తయారు చేయాల్సి ఉంటుంది. BCCI సెక్రటరీ దేవజిత్ సైకియా ఈ విషయంపై స్పందిస్తూ మేం దేశంలోని చట్టాలను పాటిస్తాం. ఒకవేళ ఏదైనా అనుమతించబడకపోతే, మేం దాన్ని చేయమని అన్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతి విధానాన్ని BCCI అనుసరిస్తుందన్నారు.

ఆసియా కప్ సెప్టెంబర్ 9న దుబాయ్, అబుదాబిలలో మొదలై, సెప్టెంబర్ 28న ఫైనల్‌తో ముగుస్తుంది. దీంతో ఇప్పుడు కొత్త స్పాన్సర్ ఎవరవుతారన్న దానిపైనే ఆసక్తి నెలకొంది. టయోటా లాంటి జెయింట్ గెలుస్తుందా? లేక ఫిన్‌టెక్ స్టార్టప్ సర్‌ప్రైజ్ ఇస్తుందా అనేది చూడాలి మరి.


ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 25 , 2025 | 11:01 AM