Share News

Drugs Seized: క్యాప్సూల్స్ నిండా కొకైన్.. రూ. 40 కోట్ల డ్రగ్స్ పట్టివేత

ABN , Publish Date - Feb 09 , 2025 | 01:36 PM

ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ డ్రగ్స్ అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. పలు రకాల పద్ధతుల్లో డ్రగ్స్ రవాణా చేస్తూ దొరికిపోతున్నారు. ఆ క్రమంలోనే తాజాగా అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ నిందితులు పట్టుబడ్డారు. వారి నుంచి ఏకంగా సుమారు రూ. 40 కోట్ల విలువైన డ్రగ్స్ లభ్యమైంది.

Drugs Seized: క్యాప్సూల్స్ నిండా కొకైన్.. రూ. 40 కోట్ల డ్రగ్స్ పట్టివేత
40 Crore Cocaine Capsules Seized Delhi

ఢిల్లీ (Delhi) విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఈరోజు (ఫిబ్రవరి 9, 2025) భారీ డ్రగ్స్ (Drugs) స్మగ్లింగ్ కేసును చేధించారు. ఈ కేసులో దాదాపు రూ. 40 కోట్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం (Cocaine Seizure) చేసుకున్నారు. ఇందులో ముగ్గురు విదేశీయులు అరెస్టు అయ్యారు. వారిలో ఇద్దరు బ్రెజిల్ మహిళలు కాగా, ఒకరు కెన్యా వ్యక్తి ఉన్నారు. కస్టమ్స్ అధికారులు ఈ డ్రగ్స్‌ను క్యాప్సూల్స్ రూపంలో తరలిస్తున్న క్రమంలో వారిని చాకచక్యంగా పట్టుకున్నారు.


కొకైన్‌తో నిండిన క్యాప్సూల్స్‌ స్వాధీనం

ఈ డ్రగ్స్‌ను నిందితులు తమ శరీరంలో నింపుకుని భారతదేశంలోకి అక్రమంగా రవాణా చేయడం కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలో తొలి అరెస్ట్ జనవరి 28, 2025న జరిగింది. ఆ రోజు అరెస్టయిన బ్రెజిల్ మహిళ ప్రయాణం సావో పాలో నుంచి పారిస్ మీదుగా జరిగింది. 26 ఏళ్లను ఆమెను మెడికల్ ఇన్వెస్టిగేషన్ చేసి తన శరీరంలో 98 క్యాప్సూల్స్ ను బయటికి తీసి, వాటిలో ఉన్న కొకైన్ రికవరీ చేశారు. దాని విలువ రూ. 12.99 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.


ఇంకో బ్రెజిల్ మహిళ

ఇదే తరహాలో జనవరి 24న మరొక బ్రెజిల్ మహిళను కూడా అధికారులు పట్టుకున్నారు. ఆ మహిళ కూడా సావో పాలో నుంచి పారిస్ మీదుగా ప్రయాణించడానికి వచ్చింది. ఆమె కూడా 100 ఓవల్ ఆకారపు క్యాప్సూల్స్‌ను తీసుకున్నట్లు ఒప్పుకుంది. ఆసుపత్రిలో చికిత్స తర్వాత ఆమె నుంచి 802 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 12.03 కోట్లని ప్రకటించారు.

కెన్యా వ్యక్తి అరెస్ట్

ఇక జనవరి 24న అడిస్ అబాబా నుంచి వచ్చిన కెన్యా వ్యక్తి కూడా దక్షిణ పశ్చిమ ఆసియా నుంచి అక్రమంగా కొకైన్‌ను తీసుకొచ్చాడు. అతన్ని అదుపులోకి తీసుకుని 67 క్యాప్సూల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 996 గ్రాముల కొకైన్‌ బయటకు రాగా, దాని విలువ రూ. 14.94 కోట్లు ఉంటుందని అధికారులు అన్నారు.


స్మగ్లింగ్ నెట్‌వర్క్

కస్టమ్స్ అధికారులు ఈ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక పరీక్షల్లో దీనిని హై ప్యూరిటీ కొకైన్‌గా నిర్ధారించారు. ఈ స్మగ్లింగ్ నెట్‌వర్క్ ద్వారా భారత్‌లోకి భారీగా కొకైన్ చేర్చేందుకు ప్రయత్నించారని కస్టమ్స్ పేర్కొంది. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ఈ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మూడు కేసుల్లో రూ. 39.96 కోట్ల విలువైన 2.66 కిలోల కొకైన్‌ను భారత్‌లో సరఫరా కాకుండా నిలిపివేశారు.


ఇవి కూడా చదవండి:

Delhi CM: ఢిల్లీ సీఎం అతిషి రాజీనామా.. అసెంబ్లీ రద్దు


PM Kisan Samman Nidhi Yojana: ఈ రైతులకు పీఎం కిసాన్ యోజన డబ్బులు రావు.. కారణాలివే..


Bus Accident: ట్రావెల్ బస్సును ఢీ కొట్టిన ట్రక్కు.. 41 మంది మృతి


Next Week IPOs: వచ్చే వారం కీలక ఐపీఓలు.. మరో 6 కంపెనీల లిస్టింగ్


BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్


Gold and Silver Rates Today: రెండు వేలకుపైగా పెరిగిన గోల్డ్.. వెండి ధర ఎలా ఉందంటే..


8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా


Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 09 , 2025 | 01:38 PM