BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
ABN , Publish Date - Feb 09 , 2025 | 07:37 AM
BSNL క్రమంగా పుంజుకుంటోంది. ఈ క్రమంలోనే అనేక మంది వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రైవేటు సంస్థలతో పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా తమ వినియోగదారులకు ఉచితంగా టీవీ ఛానెళ్లను అందిస్తున్నట్లు ప్రకటించింది.

ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సేవల ప్రొవైడర్ అయిన BSNL, వినియోగదారులకు అనేక సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తూ, ప్రైవేట్ టెలికాం సంస్థలకు గట్టి పోటీ ఇస్తోంది. ఈ క్రమంలో ఎయిర్‌టెల్, జియో వంటి ప్రైవేట్ సంస్థలు జూలై 2024లో రీఛార్జ్ ధరలను పెంచినప్పటి నుంచి.. BSNL పాత ధరలతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడూ తక్కువ ఖర్చుతో కూడిన ప్లాన్‌లను అదిస్తోంది. దీంతో అనేక మంది వినియోగదారులు ఈ నెట్‌వర్క్ వైపు మొగ్గుచూపుతున్నారు.
BSNL ప్రత్యేక ఆఫర్
తక్కువ ధరల రీఛార్జ్ ప్లాన్‌లతో పాటు BSNL ఇప్పుడు వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ కంపెనీ కొంతకాలం క్రితం BiTV సేవలను ప్రారంభించింది. ఇది వినియోగదారులకు 450+ టీవీ ఛానెల్‌లను ఉచితంగా వీక్షించడానికి అవకాశం కల్పిస్తుంది. BSNL ఈ సేవలను తన అన్ని రీఛార్జ్ ప్లాన్‌లలో చేర్చింది. అంటే మీరు మొబైల్ రీఛార్జ్ చేసినప్పుడు, టీవీ ఛానెల్‌లకు కూడా ఉచిత పొందుతారు. ఇది ఇంటర్ నెట్ వాడకంతోపాటు టీవీ ఛానెల్‌లను చూసేవారికి బెస్ట్ అని చెప్పవచ్చు. దీంతో DTH రీఛార్జ్‌ల కోసం డబ్బు ఖర్చు చేస్తున్న మిలియన్ల మంది వినియోగదారులకు ఇది గేమ్ ఛేంజర్‌గా మారనుంది. ఈ BSNL ఆఫర్ ద్వారా వినియోగదారులు అదనంగా ఏం చెల్లించకుండా ఫ్రీగా వినోదాన్ని ఆస్వాదించవచ్చు.
BiTV సర్వీస్ గురించి
BSNL BiTV సేవలు డైరెక్ట్-టు-మొబైల్ TV ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఇది వినియోగదారులకు 450 కంటే ఎక్కువ టీవీ ఛానెల్‌లను (వార్తలు, వినోదం, క్రీడలు) చూడటానికి వీలు కల్పిస్తుంది. ఈ సేవల ద్వారా వినియోగదారులు వెబ్ సిరీస్‌లు, చలనచిత్రాలను కూడా ఆస్వాదించవచ్చు. అదనపు ఛార్జీలు లేకుండా వినియోగదారులకు ఉచిత యాక్సెస్ అందిస్తున్నారు. ట్రయల్ దశలో BSNL దాదాపు 300+ ఉచిత టీవీ ఛానెల్‌లను అందించింది. కానీ ఇప్పుడు అది 450 ఛానెల్‌లకు విస్తరించింది. ఉచిత టీవీ యాక్సెస్‌తో BSNL మరింత మంది వినియోగదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇతర పోటీదారులతో పోల్చుకుంటే ఈ ప్లాన్ బెస్ట్ అని చెప్పవచ్చు.
దేశవ్యాప్తంగా..
ప్రైవేట్ టెలికాంలకు పోటీగా BSNL ఇప్పటికే దాదాపు దేశవ్యాప్తంగా 4G సేవలను పూర్తి చేసేందుకు కృషి చేస్తోంది. దీంతోపాటు 5జీ సేవలను కూడా అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో Airtel, Jio, Vi వంటి సంస్థలకు సమానంగా BSNL తన నెట్‌వర్క్‌ను చురుకుగా విస్తరించేందుకు టీసీఎస్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ నిర్ణయం ద్వారా BSNL వినియోగదారులకు మరింత కనెక్టివిటీ, హై స్పీడ్ ఇంటర్నెట్ అందించాలనుకుంటోంది.
ఇవి కూడా చదవండి:
Gold and Silver Rates Today: రెండు వేలకుపైగా పెరిగిన గోల్డ్.. వెండి ధర ఎలా ఉందంటే..
8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
Read More Business News and Latest Telugu News