Gold and Silver Rates Today: రెండు వేలకుపైగా పెరిగిన గోల్డ్.. వెండి ధర ఎలా ఉందంటే..
ABN , Publish Date - Feb 09 , 2025 | 06:33 AM
నేడు దేశంలో బంగారం, వెండి రేట్లు స్థిరంగా ఉన్నాయి. కానీ గత వారం రోజుల్లో పసిడి రేట్లు రెండు వేల రూపాయలకుపైగా పెరిగాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

దేశవ్యాప్తంగా ఈరోజు (ఆదివారం) బంగారం (gold), వెండి (silver) ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ క్రమంలో నేడు (ఫిబ్రవరి 9, 2025న) ఉదయం 6.23 గంటల నాటికి గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం చూస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 86,670గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 79,450కు చేరుకుంది. ఈ క్రమంలో గత 8 రోజుల్లో బంగారం ధరలు దాదాపు రెండు వేల రూపాయలకుపైగా పెరిగాయి.
ఇదే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఫిబ్రవరి 1న రూ. 84,490గా ఉంది. ఇక వెండి రేట్ల విషయానికి వస్తే గత 8 రోజుల్లో కూడా ఇవి హెచ్చుతగ్గులకు లోనవుతూ ఒకే స్థాయికి వచ్చాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 99,500 ఉండగా, ఫిబ్రవరి 1న కూడా వెండి రేటు ఇదే స్థాయిలో ఉంది. అంతేకాదు పుత్తడి ధరలు భవిష్యత్తులో లక్ష రూపాయలకు చేరుతాయని నిపుణులు చెబుతున్నారు.
పడిపోయిన వ్యాపారం..
ఈ క్రమంలో బంగారం ధర క్రమంగా పెరగడం వల్ల గత ఎనిమిది రోజుల్లో తమ వ్యాపారం 25 శాతం పడిపోయిందని పలువురు వ్యాపారులు అన్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కస్టమర్ల రాక బాగానే ఉంది. కానీ ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారు ఆభరణాలకు బదులు, అనేక మంది 18 క్యారెట్ల బంగారు ఆభరణాల వైపు మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు. ఈ క్రమంలో ప్రస్తుతం బంగారం ధరల పెరుగుదల ట్రెండ్ కొనసాగుతుందని అన్నారు. దీనికి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులతోపాటు దేశీయ అంశాలు కూడా కారణాలుగా ఉన్నాయన్నారు.
14 క్యారెట్ గోల్డ్..
క్యారెట్ తక్కువగా ఉంటే ఆభరణాలు దృఢంగా ఉంటాయంటున్నారు వ్యాపారులు. అందువల్ల నగల వ్యాపారులు కొత్త, ఆధునిక డిజైన్లతో తక్కువ క్యారెట్ బంగారు ఆభరణాలను తయారుచేస్తున్నారు. 18, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్ ఉంటుంది. ఇదే క్రమంలో పలు వ్యాపారులు 14 క్యారెట్ల బంగారు ఆభరణాలను కూడా ప్రవేశపెడుతున్నారు. దీని వల్ల కూడా 18 క్యారెట్లు, 14 క్యారెట్ల బంగారు ఆభరణాలపై ప్రజల్లో మక్కువ పెరుగుతోంది.
బంగారం స్వచ్ఛత తెలుసుకోవడం ఎలా?
బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999, 23 క్యారెట్‌లపై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 అని రాసి ఉంటుంది. ఎక్కువగా బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తున్నారు. 24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారం దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారంలో 9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను కలపడం ద్వారా ఆభరణాలను తయారు చేస్తారు.
ఇవి కూడా చదవండి:
Omar Abdullah: ఇంకా బాగా కొట్టుకోండి.. ఇండియా కూటమిపై ఒమర్ అబ్దుల్లా ట్వీట్
AAP vs BJP: ఆప్ నాలుగోసారి గెలుస్తుందా లేదా బీజేపీ కైవసం చేసుకుంటుందా..
Delhi Election Results 2025: నేటి ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఫస్ట్ ప్రకటించేది ఇక్కడే.. చివరగా..
Gold and Silver Rates Today: పైపైకి పసిడి, వెండి రేట్లు.. ఎంతకు చేరాయంటే..
8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
Read More Business News and Latest Telugu News