Share News

Gold and Silver Rates Today: పైపైకి పసిడి, వెండి రేట్లు.. ఎంతకు చేరాయంటే..

ABN , Publish Date - Feb 08 , 2025 | 06:28 AM

సామాన్యూలకు పెరిగిన బంగారం, వెండి ధరలు షాక్ ఇస్తున్నాయి. కొనుగోలు చేయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే గత వారం రోజుల్లోనే వీటి ధరలు ఏకంగా ఐదు వేల రూపాయలకుపైగా పెరిగాయి. ఇక నేటి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

Gold and Silver Rates Today: పైపైకి పసిడి, వెండి రేట్లు.. ఎంతకు చేరాయంటే..
gold and silver rates today

దేశంలో బడ్జెట్ 2025 తర్వాత బంగారం (gold), వెండి (silver) ధరలు క్రమంగా పైపైకి చేరుతున్నాయి. దీనికి ముందు బులియన్ మార్కెట్లో 80 వేల లోపు ఉన్న పసిడి ధరలు, ఇప్పుడు 85 వేలు దాటి దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే నేడు (ఫిబ్రవరి 8, 2025న) ఉదయం 6.25 గంటల నాటికి https://bullions.co.in వెబ్‌సైట్ ప్రకారం ఇంఫాల్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 85,210కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 78,109కు చేరింది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రేటు రూ. 84,710కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 77,651కు చేరుకుంది. ఇదే సమయంలో హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్లకు రూ. 84,990గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.77,908 స్థాయికి చేరుకుంది.


వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..

ఇక నేటి వెండి రేట్ల విషయానికి వస్తే వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 95,300కి చేరుకోగా, హైదరాబాద్, విజయవాడలో కేజీ వెండి రేటు రూ. 95,610కి చేరింది.


దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు

  • చెన్నైలో రూ. 78,008, రూ. 85,100

  • ముంబైలో రూ. 77,779, రూ. 84,850

  • కోల్‌కతాలో రూ. 77,678, రూ. 84,740

  • బెంగళూరులో రూ. 77,843, రూ. 84,920

  • మధురైలో రూ. 78,008, రూ. 85,100

  • మణిపూర్‌లో రూ. 78,109, రూ. 85,210

  • ఢిల్లీలో రూ. 77,651, రూ. 84,710

  • హైదరాబాద్‌లో రూ. 77,908, రూ. 84,990

  • విజయవాడలో రూ. 77,908, రూ. 84,990

  • పాట్నాలో రూ. 77,743, రూ. 84,810


హాల్‌మార్క్‌ ఉన్నవి కొంటున్నారా లేదా..

బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు, ప్రజలు దీని నాణ్యత గురించి ఆలోచించాలి. కస్టమర్లు హాల్‌మార్క్ గుర్తు ఉన్న పసిడి మాత్రమే కొనుగోలు చేయాలి. హాల్‌మార్క్ అనేది బంగారంపై ప్రభుత్వ హామీతో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ద్వారా నిర్ణయించబడుతుంది. ఈ క్రమంలో బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్క్ ఇస్తుంది.

24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999, 23 క్యారెట్‌లపై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 వంటి నంబర్లను ఇస్తారు. ఎక్కువగా బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తారు. 24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారం దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారంలో 9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను కలపి ఆభరణాలు తయారు చేస్తారు.


ఇవి కూడా చదవండి:

8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా


Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో

IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 08 , 2025 | 06:44 AM