PM Kisan Samman Nidhi Yojana: ఈ రైతులకు పీఎం కిసాన్ యోజన డబ్బులు రావు.. కారణాలివే..
ABN , Publish Date - Feb 09 , 2025 | 11:59 AM
దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది రైతులకు ఫిబ్రవరి 24న గుడ్ న్యూస్ రానుంది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత నిధులను విడుదల చేయనున్నారు. అయితే ఈసారి కొంత మంది రైతులకు మాత్రం ఈ మొత్తం అందదు. ఎందుకనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan Samman Nidhi Yojana) పథకం కింద ప్రయోజనాలు పొందుతున్న రైతులు 19వ విడత నగదు కోసం ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 24న దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ పథకం 19వ విడతను నిధులను విడుదల చేయనున్నారు. అయితే ఈసారి కొంతమంది రైతులకు మాత్రం ఈ డబ్బులు అందవు. ఈ స్కీం ప్రయోజనం అందుకోవడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇంకా పూర్తి చేయని రైతులకు ఈ విడతలో ప్రయోజనం అందదు. అలాగే భూ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయని రైతులు కూడా ఈ విడతలో సహాయం పొందలేరు.
దీంతోపాటు ఇవి కూడా..
రైతుల ఖాతాలు DBT (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) కూడా ఆన్ చేసుకోవడం చాలా ముఖ్యం. DBT ఆఫ్ చేసి ఉన్న రైతులకు వాయిదాల డబ్బులు వారి ఖాతాల్లోకి చేరవు. అందువల్ల వారు తమ బ్యాంక్ ఖాతాల్లో DBT ఆన్ చేసుకోవడం తప్పనిసరి అనేది గుర్తుంచుకోండి. ఈ పథకం 2019లో ప్రారంభించబడింది. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం 6000 రూపాయల ఆర్థిక సహాయం రైతులకు అందిస్తారు.
ఈ మొత్తం మూడు విడతలుగా రైతుల ఖాతాలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా పంపబడుతుంది. ప్రతి విడత 2000 రూపాయలు రైతుల ఖాతాలకు జమ అవుతుంది. ప్రతి నాలుగు నెలల వ్యవధిలో రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేస్తారు. ఈ పథకంతో దేశంలోని కోట్లాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు.
కేవైసీ ఎలా చేయాలి
PM కిసాన్ యోజన్ లబ్ధిదారులు pmkisan.gov.in అధికారిక వెబ్ సైట్‌ని సందర్శించి వారి e-KYC స్థితిని చెక్ చేసుకోవచ్చు. అక్కడ హోమ్‌పేజీలో మీరు ఫార్మర్ కార్నర్ విభాగంలో eKYC ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు మీరు eKYC పేజీలో మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత సెర్చ్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
ఆ OTPని నమోదు చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ eKYC పూర్తి కాకపోతే, అది అప్‌డేట్ అయినట్లుగా మీకు మెసేజ్ వస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇప్పటి వరకు 18వ విడతలో రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 3.46 లక్షల కోట్ల నిధులు విడుదలయ్యాయి. 19వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ స్కీం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 13 కోట్ల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు.
ఇవి కూడా చదవండి:
Bus Accident: ట్రావెల్ బస్సును ఢీ కొట్టిన ట్రక్కు.. 41 మంది మృతి
Next Week IPOs: వచ్చే వారం కీలక ఐపీఓలు.. మరో 6 కంపెనీల లిస్టింగ్
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Gold and Silver Rates Today: రెండు వేలకుపైగా పెరిగిన గోల్డ్.. వెండి ధర ఎలా ఉందంటే..
8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
Read More Business News and Latest Telugu News