Jammu and Kashmir: లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. ముగ్గురు జవాన్లు మృతి
ABN, Publish Date - May 04 , 2025 | 01:57 PM
Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్‌లోని రాంభన్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మీ జవానులతో వెళ్తున్న వాహనం లోయలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు.
శ్రీనగర్, మే 04: శ్రీనగర్, మే 04: జమ్మూ కాశ్మీర్‌లోని రాంభన్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మీ జవానులతో వెళ్తున్న వాహనం లోయలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న ఆర్మీ అధికారులు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
దాదాపు 700 అడుగుల లోయలో ఈ ఆర్మీ వాహనం పడిపోయింది. జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇక ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతోన్నాయి. ఈ సహాయక చర్యల్లో ఆర్మీ అధికారులు, కాశ్మీర్ పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌తోపాటు స్థానిక వాలంటీర్లు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
Pehalgam Terror Attack: ప్రధాని మోదీతో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ భేటీ..
India Vs Pakistan: భారత్ సైనిక సమాచారం పాక్‌కు చేరవేత.. ఇద్దరి అరెస్ట్
Rahul Gandhi: సిక్కుల ఊచకోతపై రాహుల్ గాంధీ స్పందన
India Vs Pakistan: భారత్‌తో యద్ధంపై స్పందించిన పాక్ రాయబారి
Char Dham Yatra 2025: తెరుచుకున్న బద్రీనాథ్ దేవాలయం తలుపులు
Dr KV Subramaniam: డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యంను విధుల నుంచి తొలగించిన కేంద్రం
Pakistan violates ceasefire: మళ్లీ కవ్వింపు చర్యలకు దిగిన పాక్
For National News And Telugu News
Updated Date - May 04 , 2025 | 02:04 PM