ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IRCTC Tour: ఐఆర్‌‌సీటీసీ స్పెషల్ ఆఫర్.. ఒకే టూర్లో సింగపూర్, మలేషియా చూసే ఛాన్స్!

ABN, Publish Date - Aug 05 , 2025 | 04:40 PM

విదేశాల్లో విహరించాలనే ఆలోచన చాలామందికి ఉంటుంది.కానీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయని భావించి ఆ కోరికను పక్కనపెట్టేస్తారు. అలాంటి వారి కోసం ఇప్పుడు IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) అద్భుతమైన ప్యాకేజీ తీసుకొచ్చింది. ఒకే ప్యాకేజీలో మలేసియా, సింగపూర్ దేశాలను కవర్ చేస్తూ.. అతితక్కువ ధరకే విదేశీ పర్యటన చేసే అవకాశం కల్పిస్తోంది.

IRCTC Malaysia Singapore Tour Package details

IRCTC Malaysia Singapore Tour: విదేశీ టూర్‌ను కలలాగా భావిస్తున్నారా? ఖర్చు ఎక్కువ అవుతుందేమోనని ఆలోచించి వెనక్కి తగ్గుతున్నారా? అలాంటి ప్రయాణికుల కోసమే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అద్భుతమైన విదేశీ టూర్ ఆఫర్‌ను అందిస్తోంది. ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక గమ్యస్థానాలలో ఒకటైన సింగపూర్, సాంస్కృతిక వైవిధ్యానికి నిలయమైన మలేసియా దేశాలను ఒకే ప్యాకేజీలో చుట్టేయడానికి ఇది మంచి అవకాశం.!

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సింగపూర్ జూలాజికల్ గార్డెన్‌లు, ఉద్యానవనాలు, మెర్లియన్ పార్క్, యూనివర్సల్ స్టూడియోస్ లాంటి అద్భుత ప్రదేశాలను చూడాలనుకునే వారికి తక్కువ ఖర్చుతో చుట్టేసేందుకు ఇదే మంచి ఛాన్స్. సాధారణంగా విదేశీ పర్యటనలు అధిక ఖర్చుతో కూడుకున్నవిగా ఉంటాయి. అయితే, ఇప్పుడు IRCTC ప్యాకేజీ ద్వారా తక్కువ ధరతోనే అద్భుతమైన యాత్రానుభవాన్ని సొంతం చేసుకోవచ్చు. అత్యుత్తమ సౌకర్యాలతో ఐఆర్‌‌సీటీసీ ఈ 7 రోజుల అంతర్జాతీయ పర్యటన ప్యాకేజీని అందిస్తోంది.

IRCTC రూపొందించిన ఈ 7 రోజుల ప్రత్యేక ప్యాకేజీ పేరు "Magical Malaysia with Singapore Sensation". ఈ ప్యాకేజీ 2025 ఆగస్టు 11వ తేదీన ప్రారంభం కానుంది. హైదరాబాద్ నుండి నేరుగా విమాన ప్రయాణంతో ప్రారంభమయ్యే ఈ ప్యాకేజీకి మొత్తం 34 మంది మాత్రమే అర్హులు. అంతేగాక, ఈ యాత్రకు వెళ్లాలనుకునేవారి వద్ద కనీసం 6 నెలల గడువు ఉన్న పాస్‌పోర్ట్ కచ్చితంగా ఉండాలి. ఈ ట్రిప్ వివరాలు, ప్రయాణ ప్రణాళిక, టికెట్ ధరలు ఇక్కడ తెలుసుకుందాం.

టూర్ వివరాలు?

ఈ ప్యాకేజీ హైదరాబాద్‌ నుండి విమాన ప్రయాణంతో ప్రారంభమవుతుంది. మొత్తం టూర్ వ్యవధి 6 రాత్రులు, 7 రోజులు. ఈ ప్యాకేజీ కోసం 34 మందికి మాత్రమే ముందుగా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు.

  • టూర్ స్టార్ట్ డేట్: ఆగస్టు 11

  • స్టార్టింగ్ పాయింట్: హైదరాబాద్ – రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్

  • ఫ్లైట్ టైం: రాత్రి 11 గంటలకు..

రోజు వారీ టూర్ ప్లాన్:

  • 1వ రోజు: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రిపోర్టింగ్ చేశాక రాత్రి 11 గంటలకు ఫ్లైట్ ద్వారా ప్రయాణం

  • 2వ రోజు: ఉదయం కౌలాలంపూర్ చేరుకుని హోటల్‌లో చెక్-ఇన్ అవుతారు. మధ్యాహ్నం నుంచి సైట్ సీయింగ్ ఉంటుంది. కింగ్స్ ప్యాలెస్, ఇండిపెండెన్స్ స్క్వేర్, నేషనల్ మాన్యుమెంట్, పెట్రోనాస్ ట్విన్ టవర్స్ (స్కై బ్రిడ్జ్), చాక్లెట్ ఫ్యాక్టరీ చూస్తారు. రాత్రి డిన్నర్ చేశాక కౌలాలంపూర్‌లో బస చేస్తారు.

  • 3వ రోజు: బటు కేవ్స్, గెంటింగ్ హైలాండ్స్ సందర్శిస్తారు. రాత్రికి కౌలాలంపూర్‌కు తిరిగి వచ్చి డిన్నర్ చేశాక హోటళ్లో స్టే చేస్తారు.

  • 4వ రోజు: పర్యాటక బృందం పుత్రజయకు ప్రయాణమవుతారు. లంచ్ అనంతరం రోడ్ మార్గంలో సింగపూర్ చేరుకుంటారు. రాత్రికి డిన్నర్. అనంతరం హోటల్‌లో బస.

  • 5వ రోజు: సింగపూర్ సిటీ టూర్లో భాగంగా ఆర్చిడ్ గార్డెన్, మెర్లియన్ పార్క్, సింగపూర్ ఫ్లైయర్ రైడ్, మేడమ్ టుస్సాడ్స్, వింగ్స్ ఆఫ్ టైమ్ షో సందర్శిస్తారు. రాత్రికి సింగపూర్ హోటల్‌లో స్టే చేస్తారు.

  • 6వ రోజు: రోజంతా యూనివర్సల్ స్టూడియోస్ సందర్శన ఉంటుంది. రాత్రి డిన్నర్ పూర్తయ్యాక హోటళ్లో విశ్రాంతి తీసుకుంటారు.

  • 7వ రోజు: ఈ రోజున పర్యాటకులు ప్రధానంగా బర్డ్ ప్యారడైజ్ సందర్శిస్తారు. షాపింగ్, లంచ్ అనంతరం ఎయిర్‌పోర్ట్ చేరుకుని సాయంత్రం హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కుతారు.

ప్యాకేజీ ధరలు: (కంఫర్ట్ క్లాస్)

  • ఒక్కరికి - రూ.1,49,230

  • డబుల్ షేరింగ్ - రూ.1,21,980

  • ట్రిపుల్ షేరింగ్ - రూ.1,21,860

  • పిల్లలకు(5–11 yrs) విత్ బెడ్ రూ.1,09,560

  • పిల్లలకు వితవుట్ బెడ్ -రూ.92,990

ప్యాకేజీలో ఉండే సదుపాయాలు:

  • హైదరాబాద్ టూ కౌలాలంపూర్/ సింగపూర్ టూ హైదరాబాద్ విమాన టికెట్లు

  • హోటల్‌లో బస

  • 5 బ్రేక్‌ఫాస్ట్‌లు, 6 లంచ్‌లు, 6 డిన్నర్‌లు

  • అన్ని టూర్‌లకు గైడ్ సేవలు

  • మలేసియా, సింగపూర్ వీసా ఛార్జీలు

  • ట్రావెల్ ఇన్సూరెన్స్

ముఖ్య గమనికలు:

  • ప్యాకేజీకి అర్హత పొందాలంటే కనీసం 6 నెలల వ్యాలిడిటీ ఉన్న పాస్‌పోర్ట్ అవసరం.

  • బుకింగ్‌ల సంఖ్య పరిమితంగా ఉన్నందున ముందుగానే బుకింగ్ చేసుకోవాలి.

  • బుకింగ్ లేదా మరింత సమాచారం కోసం అధికారిక IRCTC వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Also Read:

ఈ 5 మంది ఎట్టి పరిస్థితుల్లో బొప్పాయి తినకూడదు.. చాలా డేంజర్..!

అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉండేందుకు సింపుల్ టిప్స్..!

For More Latest News

Updated Date - Aug 05 , 2025 | 05:08 PM