ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Donald Trump: ఈసారి ఇలా చేయండి.. మెక్రాన్ దంపతులకు ట్రంప్ సలహా..

ABN, Publish Date - May 31 , 2025 | 11:25 AM

Trump Macron Doors Comment: ఇటీవల ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌‌ను భార్య బ్రిగెట్టా ముఖంపై చేతులు పెట్టి నెడుతున్న వీడియో విపరీతంగా వైరల్ అయింది. ఈ సంఘటనపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు. ఈ సారి ఇలా చేయడంటూ ఉచిత సలహా కూడా ఇచ్చారు.

Trump Comment About Macron Shoving Incident

Trump Macron Shoving Incident: ఫ్రాన్స్ (France) అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌‌ (Emmanuel Macron)ను ఆయన భార్య బ్రిగెట్టా ముఖంపై కొడుతున్నట్టుగా ఉన్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఆ తర్వాత వారి లవ్ స్టోరీ, వివాహం కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ అంశంపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump)కు మీడియా సమావేశంలో ఓ ప్రశ్న ఎదురైంది. అందుకు ఎప్పట్లానే తనదైన శైలిలో చమత్కరించారు ట్రంప్. వారు మంచి జంట అని ప్రశంసించడంతో పాటు కొన్ని ప్రత్యేక సలహాలు కూడా ఇచ్చారు.


మెక్రాన్‌‌కు ట్రంప్ సలహా

శుక్రవారం ఓవల్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మెక్రాన్ దంపతుల వైరల్ వీడియోపై మీ అభిప్రాయం చెప్పాలని ఓ విలేకరి ట్రంప్‌ ను కోరారు. ఇందుకు ట్రంప్ నవ్వుతూ ఈ అంశంపై ఇది వరకే మెక్రాన్‌తో నేరుగా మాట్లాడానని అన్నారు. వారిద్దరూ నిజంగా మంచి వ్యక్తులు. నాకు వారి గురించి బాగా తెలుసు. ఇదంతా దేని గురించి అని నాకు కచ్చితంగా తెలియదు అని చెప్పుకొచ్చారు. అనంతరం మెక్రాన్ దంపతులకు మీరేమైనా సలహా ఇవ్వాలనుకుంటున్నారా అని విలేకరి ప్రశ్నించగా.. ఈ సారి తలుపులు వేసుకోవడం మర్చిపోవద్దని సరదాగా చమత్కరించారు.


వీడియోలో ఏముంది?

ఫ్రెంచ్ అధ్యక్షుడు మెక్రాన్, ఆయన భార్య బ్రిగెట్టా వియత్నాం పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఓ వీడియో బయటికొచ్చింది. హనోయ్ విమానాయాశ్రంలో మెక్రాన్‌‌ను ముఖంపై ఎర్రటి జాకెట్ ధరించిన రెండు చేతులు నెట్టివేస్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. విమానం నుంచి వెలుపలకు వచ్చేటప్పుడు మెక్రాన్ సతీమణి బ్రిగెట్టా అదే రంగు జాకెట్ ధరించింది. మెట్లు దిగేటప్పుడు మెక్రాన్ చేయి అందించినా పట్టుకునేందుకు నిరాకరించింది. తల తప్పి వెనక్కి జరిగింది. దీంతో మెక్రాన్ దంపతుల మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయని ఫ్రెంచ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే, వైరల్ వీడియోపై అధ్యక్షుడు మెక్రాన్ స్పందించారు. అందరూ అనుకుంటున్నట్లుగా మా మధ్య గొడవలేం లేవని.. ఇదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపడేశారు. ఆ క్షణంలో ఇద్దరం సరదాగా మాట్లాడుకుంటున్నామని స్పష్టం చేశారు.


ఇవీ చదవండి:

ఆపరేషన్ సిందూర్‌పై కొలంబియా అభ్యంతరం.. స్పందించిన శశి థరూర్

వాస్తవాన్ని వివరించిన భారత్.. పాక్‌కు మద్దతు ఉపసంహరించిన కొలంబియా

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 31 , 2025 | 12:00 PM