ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pakistan: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం.. హనీట్రాప్‌లో చిక్కి పారిపోయిన రాయబారి..

ABN, Publish Date - May 16 , 2025 | 08:49 PM

Pakistan Diplomatic Scandal: పాకిస్థాన్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. 'ఆపరేషన్ సిందూర్' చావు దెబ్బతిన్న దాయాది దేశానికి మరో ఘోర అవమానం జరిగింది. బంగ్లాదేశ్ లోని పాక్ రాయబారికి సంబంధించిన అశ్లీల వీడియోలు, ఫొటోలు బయటకు రావడంతో పత్తా లేకుండా పారిపోయాడు. ప్రస్తుతం బంగ్లా ప్రభుత్వం ఈ విషయమై దర్యాప్తు జరుపుతోంది.

Pakistan High Commissioner Honeytrap Scandal

Pakistan High Commissioner Honeytrap Scandal: ఉగ్రవాదుల విషయంలో నిత్యం అబద్ధాలు చెప్తూ, తప్పుల మీద తప్పులు చేస్తూ పాకిస్థాన్ ఇప్పటికే అంతర్జాతీయంగా అప్రతిష్ఠపాలైంది. 'ఆపరేషన్ సిందూర్' దెబ్బ నుంచి కోలుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలోనే మరో ఇబ్బందికరమైన సంఘటన జరిగింది. బంగ్లాదేశ్‌లోని పాకిస్థాన్ హైకమిషనర్ సయ్యద్ అహ్మద్ మరూఫ్ 2025 మే 11న హఠాత్తుగా ఢాకా విడిచి వెళ్ళవలసి వచ్చింది. సయ్యద్ హనీ ట్రాప్‌లో చిక్కుకున్నాడు. బంగ్లాదేశ్ కు చెందిన మహిళతో కలిసి ఉన్న అశ్లీల వీడియోలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దెబ్బకు అహ్మద్ మరూఫ్ పరారీ అయినట్లు తెలుస్తోంది. అయితే, ఇందులో నిజం లేదని.. సెలవుపై వెళ్లారని పాకిస్థాన్ దౌత్యకార్యాలయం ఓ ప్రకటనలోతెలిపింది.


బంగ్లాదేశ్ లో 2023 డిసెంబర్‌ నుంచి దౌత్య విధులను నిర్వర్తిస్తున్నాడు మారూఫ్. కాక్స్ బజార్‌లోని ఒక హోటల్‌లో మహిళతో ఉన్న వీడియోలు బయటకు రావడంతో పాక్ తిరిగి వెనక్కి పిలిపించిందనే ప్రచారం జరుగుతోంది. ఇక, అహ్మద్ మారూఫ్ బంగ్లాదేశ్ బ్యాంకులో పనిచేస్తున్న సీనియర్ అధికారి హఫీజా హక్ షాతో సంబంధం కలిగి ఉన్నాడనే ఆరోపణలు ఉన్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ - పాకిస్థాన్ సంబంధాలను మెరుగుపరచడంలో మారూఫ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ వివాదం కారణంగా మరూఫ్ అనూహ్యంగా నిష్క్రమించడం పాకిస్థాన్‌కు జాతీయంగా ఇబ్బంది కలిగించడమే కాకుండా బంగ్లాదేశ్ -పాకిస్థాన్ సంబంధాలకు కూడా భారీ ఎదురుదెబ్బ .


Read Also: India-Taliban Ties: భారత్‌తో సంబంధాల పునరుద్ధరణ ఆప్ఘన్ సై

Indonesia: ఇండోనేషియాలో అల్లర్లు.. 20మంది మృతి

NRI Money Transfer Tax: ఎన్నారైలకు షాకింగ్ న్యూస్.. విదేశాలకు మనీ పంపిస్తే బాదుడేనా..

Updated Date - May 16 , 2025 | 09:15 PM