NRI Money Transfer Tax: ఎన్నారైలకు షాకింగ్ న్యూస్.. విదేశాలకు మనీ పంపిస్తే బాదుడేనా..
ABN , Publish Date - May 16 , 2025 | 02:52 PM
ఇప్పటికే సుంకాల పేరుతో అనేక దేశాలను హడలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో షాక్ ఇచ్చాడు. విదేశీ డబ్బు బదిలీలపై 5% పన్ను విధించాలని అమెరికా బిల్లును ప్రతిపాదించింది. ఇది ఆమోదం పొందితే ఎన్నారైలు పంపించే మనీపై అదనంగా పన్ను పడనుంది.
అగ్రరాజ్యం అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత సుంకాల పేరుతో అనేక రూల్స్ ప్రకటించారు. దీంతో అనేక దేశాలు అసృంతృప్తి వ్యక్తం చేయగా, ట్రంప్ తాజాగా మరో కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ చట్టం అమలైతే భారతదేశానికి అక్కడున్న వారు డబ్బు పంపడం మరింత ఖరీదైన వ్యవహారంగా మారుతుంది. ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని అనధికారికంగా పిలిచే ఈ చట్టం, విదేశీ పౌరులు (నాన్-యూఎస్ సిటిజన్స్) చేసే అన్ని అంతర్జాతీయ డబ్బు బదిలీలపై 5% పన్ను (NRI money transfer tax USA) విధించాలని ప్రతిపాదిస్తోంది.
వీరిపై పడనున్న భారం..
ఈ చట్టం ఆమోదం పొందితే హెచ్-1బీ, ఎఫ్-1 వంటి నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలు కలిగిన వ్యక్తులు, గ్రీన్ కార్డ్ హోల్డర్లు, డాక్యుమెంట్ లేని వలసదారులు ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వెస్ట్రన్ యూనియన్, పేపాల్ లేదా సాధారణ బ్యాంకుల ద్వారా చేసే డబ్బు బదిలీలపై ఈ పన్ను వసూలు చేస్తారు. ఈ ప్రతిపాదన ఇంకా ఆమోదం పొందలేదు, కానీ ఆమోదం పొందితే, ఇది 2025 జూలై నుంచి అమలులోకి రానుంది. దీంతో ఈ కొత్త చట్టం గురించి అమెరికాలో భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ చట్టం ఎందుకు తీసుకొస్తున్నారంటే..
రిపబ్లికన్ పార్టీలోని కొందరు నాయకులు వలసలను అరికట్టడానికి, అమెరికా నుంచి బయటకు వెళ్లే డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి ఈ చట్టాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఈ ఆలోచన మొదట 2016లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేత ప్రతిపాదించబడింది. అప్పట్లో ఈ పన్ను ద్వారా సేకరించిన డబ్బును మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి ఉపయోగించాలని ఉద్దేశించారు. ఇప్పుడు ఈ ఆలోచన మరింత విస్తృత రూపం దాల్చనుంది.
భారతదేశంపై తీవ్ర ప్రభావం
భారతదేశం ప్రపంచంలో అత్యధిక రెమిటెన్స్ (విదేశాల నుంచి వచ్చే డబ్బు) స్వీకరించే దేశంగా ఉంది. ఈ క్రమంలో 2023లో భారతదేశం 129 బిలియన్ డాలర్ల రెమిటెన్స్‌ను అందుకుంది, ఇందులో 32 బిలియన్ డాలర్లు అమెరికా నుంచి వచ్చాయి. ఈ కొత్త 5% పన్ను అమలైతే, భారతీయులు సంవత్సరానికి సుమారు 1.7 బిలియన్ డాలర్లు అదనంగా పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. భారతదేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, అమెరికాలో దాదాపు 45 లక్షల మంది భారతీయ సంతతి వ్యక్తులు నివసిస్తున్నారు.
చట్టం అమలైతే ఎలా పని చేస్తుంది
అన్ని అంతర్జాతీయ రెమిటెన్స్‌లపై 5% పన్ను విధించబడుతుంది
ప్రభావిత వ్యక్తులు: హెచ్-1బీ, ఎఫ్-1 వంటి నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా హోల్డర్లు, గ్రీన్ కార్డ్ హోల్డర్లు, డాక్యుమెంట్ లేని వలసదారులు
వసూలు విధానం: వెస్ట్రన్ యూనియన్, పేపాల్ లేదా బ్యాంకులు బదిలీ సమయంలో పన్నును స్వయంచాలకంగా తీసివేస్తాయి
అమలు సమయం: చట్టం ఆమోదం అయితే, 2025 జూలై నుంచి అమలు కానుంది.
ఇవి కూడా చదవండి
Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..
Penny Stock: ఈ స్టాక్‌పై రూ.4 లక్షల పెట్టుబడి..ఏడేళ్ల లోనే రూ.56 లక్షల లాభం..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి