Share News

Indonesia: ఇండోనేషియాలో అల్లర్లు.. 20మంది మృతి

ABN , Publish Date - May 16 , 2025 | 07:43 PM

ఇండోనేషియాలో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో 20 మంది మరణించారు. వారిలో 18 మంది రెబల్స్ కాగా.. ఇద్దరు పోలీస్ అధికారులు ఉన్నారు.

Indonesia: ఇండోనేషియాలో అల్లర్లు.. 20మంది మృతి

జకార్తా, మే 16: ఇండోనేషియాలోని పావువా ప్రాంతంలో భద్రతా బలగాలు, వేర్పాటువాదులకు మధ్య శుక్రవారం ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో మొత్తం 20 మంది మరణించారు. వీరిలో18 మంది రెబల్స్ కాగా.. ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులు ఉన్నారని మిలటరీ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ ఇవాన్ ద్వి ప్రిహర్టోనో వెల్లడించారు. ఇంతన్ జయ ప్రాంతం తిరుగుబాటుదారులకు కేంద్రంగా ఉన్న సంగతి తెలిసిందే. విద్య, వైద్య సేవలు అందించేందుకు మిలటరీ దళాలు ఈ ప్రాంతానికి బుధవారం చేరుకున్నాయి.

దీంతో డజన్ల కొద్ది రెబల్స్ ఆయుధాలతో వీధుల్లోకి వచ్చి.. ఈ ప్రభుత్వ దళాలపై దాడులకు దిగాయని.. దీంతో యుద్ధం చెలరేగిందని ద్వి ప్రిహర్టోనో వివరించారు. ఇక ఈ ఘర్షణ అనంతరం రైఫిల్, స్వదేశీ తుపాకీ, బాణాలతోపాటు తుపాకీ బుల్లెట్లను తిరుగుబాటుదారులకు చెందిన జెండాను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అయితే ప్రభుత్వం తరపున ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు.


1960 మొదట్లో ఇండోనేషియా ఒకప్పుడు డచ్ కాలనీగా ఉన్న ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. నాటి నుంచి పాపువాలో తిరుగుబాటు ప్రారంభమైంది. 1969లో పాపువాను ఇండోనేషియాలో విలీనం చేశారు.


ఇక పశ్చిమ పాపువా లిబరేషన్ ఆర్మీ తిరుగుబాటు దారుడు సెబ్బీ సాంబోమ్ మాట్లాడుతూ.. ఈ అల్లర్లలో ముగ్గురు మాత్రమే మరణించారని చెప్పారు. మిగిలిన వారంతా అమాయకులని స్పష్టం చేశారు. అలాగే పుంకాక్ జయ రీజెన్సీలో తిరుగుబాటుదారులు ఇద్దరు పోలీసులను హత్య చేశాని వివరించారు. ఇటీవల తిరుగుబాటుదారుల దాడులు పెరిగాయి. ఈ దాడుల్లో తిరుగుబాటుదారులు, భద్రతా దళాలతోపాటు స్థానికులు సైతం మరణించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..

Penny Stock: ఈ స్టాక్‎పై రూ.4 లక్షల పెట్టుబడి..ఏడేళ్ల లోనే రూ.56 లక్షల లాభం..

For International News And Telugu News

Updated Date - May 16 , 2025 | 07:46 PM