Pak Army Spokesman: మహిళా రిపోర్టర్‌పై కన్నుగీటిన పాక్ ఆర్మీ ప్రతినిధి..
ABN, Publish Date - Dec 10 , 2025 | 01:07 PM
పాకిస్తాన్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌద్రీ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఓ మీడియా సమావేశంలో మహిళా జర్నలిస్ట్ ని చూసి కన్నుకొట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్, డిసెంబరు10 (ఆంధ్రజ్యోతి): పాకిస్తాన్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌద్రీ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఓ మీడియా సమావేశంలో మహిళా జర్నలిస్ట్‌ను చూసి కన్నుకొట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పాకిస్థాన్ (Pakistan)కు చెందిన ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌద్రీ (Ahmed Sharif Chaudhry) ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కు్కోవడం చూస్తూనే ఉన్నాం. సమయం దొరికినప్పడల్లా భారత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా ఓ మీడియా సమయంలో మహిళా జర్నలిస్టు అబ్సా కోమన్ (Absa Koman) వైపు చూస్తు కన్నుకొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మీడియా సమావేశంలో మహిళా జర్నలిస్ట్ అబ్సా కోమన్ జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) గురించి కొన్ని ప్రశ్నలు అడిగింది. ఆమె ప్రశ్నలు విన్న షరీఫ్ అతను ఓ మానసిక రోగి అంటూ సమాధానం ఇచ్చాడు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల్లో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల మధ్య చీలికలు తీసుకువస్తే సహించేది లేదు. జాతీయ భద్రతకు ముప్ప తీసుకురావాలిని చూస్తే ఎవరినీ వదిలిపెట్టం.. కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
తర్వాత అహ్మద్ షరీఫ్ చౌద్రీ ఆమె వైపు చూస్తూ కన్నుకొట్టాడు. అంతే అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆర్మీ అధికార ప్రతినిధి అయి ఉండి డిసిప్లేన్ గా ఉండాల్సిన వ్యక్తి ఇలా మహిళా జర్నలిస్ట్ ని కించపరిచేలా కన్నుగీటడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఘటనపై ‘ఎక్స్’ వేదికగా పలువురు నెటిజన్లు అహ్మద్ షరీఫ్ చౌద్రీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ కెమెరాల ముందే ఇలా జరుగుతోంది, పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం పూర్తిగా చచ్చిపోయింది. ఆర్మీ చేతిలో పీఎం కీలుబొమ్మ’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
ఇవీ చదవండి:
హమాస్, ఎల్‌ఈటీ మధ్య సంబంధాలు.. భారత్‌కు ఇజ్రాయెల్ కీలక విజ్ఞప్తి
వివిధ దేశాల నుంచి భారతీయుల డిపోర్టేషన్.. వివరాలను వెల్లడించిన కేంద్రం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Dec 10 , 2025 | 01:52 PM