Share News

Indians Deported: వివిధ దేశాల నుంచి భారతీయుల డిపోర్టేషన్.. వివరాలను వెల్లడించిన కేంద్రం

ABN , Publish Date - Dec 05 , 2025 | 02:28 PM

గత ఐదేళ్లల్లో వివిధ దేశాల్లో భారతీయుల డిపోర్టేషన్లకు సంబంధించిన వివరాలకు కేంద్రం తాజాగా వెల్లడించింది. యూకే అత్యధికంగా 170 మందిని భారత్‌కు తిరిగి పంపించింది. ఇక రష్యా 82 మంది భారతీయులను డిపోర్టు చేసింది.

Indians Deported: వివిధ దేశాల నుంచి భారతీయుల డిపోర్టేషన్.. వివరాలను వెల్లడించిన కేంద్రం
Indians Deported in the Last 5 years

ఇంటర్నెట్ డెస్క్: గత ఐదేళ్లల్లో రష్యా 82 మంది భారతీయులను డిపోర్టు చేసిందని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. విదేశాంగ శాఖ గురువారం పార్లమెంటులో ఈ విషయాన్ని తెలిపింది. గత ఐదేళ్లల్లో ఏయే దేశాలు భారతీయులను వెనక్కు పంపించాయనే వివరాలను పేర్కొంది. (Indians Deported in the Last Five years).

ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఆస్ట్రేలియా గత ఐదేళ్లల్లో 114 మంది భారతీయులను డిపోర్టు (స్వదేశానికి పంపించడం) చేసింది. రష్యా 82 మందిని వెనక్కు పంపించింది. యూకే 170 మంది భారతీయులను, ఉక్రెయిన్ 13 మందిని, ఫిన్‌ల్యాండ్ ఐదుగురిని, జార్జియా 17 మందిని డిపోర్టు చేసింది. ఇక ఈజిప్టు ఇద్దరు భారతీయులను, ఆస్ట్రియా ఒక్కరిని, చైనా నలుగురిని డిపోర్టు చేశాయి. వీటికి తోడు అమెరికా గత ఐదేళ్లల్లో 62 మంది భారతీయులను తమ దేశంలోకి అనుమతించేందుకు నిరాకరించింది. వీసా నిబంధనల అతిక్రమణ మొదలు ఇతర రకాల చట్ట ఉల్లంఘనలతో భారతీయులు స్వదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది.


ఇంగ్లిష్ ప్రధాన భాషగా ఉన్న దేశాలు వలసలకు అడ్డుకట్ట వేస్తున్న తరుణంలో ఈ గణాంకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆస్ట్రేలియా తాజాగా వలసల కట్టడి కోసం స్టూడెంట్ వీసా నిబంధనలను కఠినతరం చేసింది. బేస్ వీసా ఫీజును 1600 డాలర్ల నుంచి 2 వేల డాలర్లకు పెంచింది. దీంతో, అత్యధిక స్టూడెంట్ వీసా ఖర్చులున్న దేశాల జాబితాలో ఆస్ట్రేలియా కూడా వచ్చి చేరింది. విద్యార్థి వీసాకు ఆమోదం తెలిపే విషయంలో ప్రాధ్యాన్యతా క్రమాన్ని అనుసరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్యాకేజ్డ్ కోర్సుల్లో చేరే వారిపై మరింత నిఘా పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

మరోవైపు, బ్రిటన్ స్టూడెంట్ వీసా నిబంధనలు కూడా కఠినతరం కానున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ విద్యార్థుల ఆర్థిక అర్హతలను మరింత కట్టుదిట్టం చేయనుంది. లండన్‌లో ఉండేందుకు ఇకపై అంతర్జాతీయ విద్యార్థులు నెలకు 1529 పౌండ్ల చొప్పున నిధులు సమకూర్చుకోవాలి. గతంలో ఇది 1483 పౌండ్లుగా ఉండేది. ఇక ఇతర ప్రాంతాల్లో నివాసానికి సంబంధించి నెలలవారీ నిధులను 1136 పౌండ్ల నుంచి 1483 పౌండ్లకు పెంచింది.


ఇవీ చదవండి:

కూలిన అమెరికా ఎఫ్-16సీ ఫైటర్ జెట్.. పైలట్ సేఫ్

తీరు మార్చుకోని పాక్.. భారత గగనతలంలోకి విమానాలను అనుమతించినా..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 05 , 2025 | 02:39 PM