ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Masoud Pezeshkian: ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో అణు కార్యకలాపాలు ఆపదు: అధ్యక్షుడు మసౌద్

ABN, Publish Date - Jun 22 , 2025 | 07:46 AM

Masoud Pezeshkian About Nuclear Activities: ఇరాన్ అణు కార్యకలాపాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ముందుకెళ్తోంది. అలాగే అమెరికా కూడా టెహ్రాన్ అణు చర్చలకు అంగీకరించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. అయినా, ఇరాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అణుకార్యకలాపాలు ఆపబోమని తేల్చి చెప్పింది.

Iran President Pezeshkian on Nuclear Activities

Iran President Pezeshkian on Nuclear Activities: ఇరాన్-ఇజ్రాయెల్ (Iran-israel War) మధ్య పదో రోజునా భీకర పోరు కొనసాగుతోంది. టెల్ అవీవ్ కు తోడుగా అమెరికా కూడా ప్రత్యక్ష యుద్ధరంగంలోకి (US Strikes Iran) దిగింది. బీ-2 స్పిరిట్‌ బాంబర్లతో ఇరాన్ లోని ఫోర్డో, నతాంజ్‌, ఇస్ఫాహన్ అణుకేంద్రాలపై భారీ దాడులు చేయడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. ఒక పక్క ఇజ్రాయెల్ వరస దాడులు, మరో పక్క అగ్రరాజ్య ఒత్తిడి ఉన్నప్పటికీ టెహ్రాన్ వెనకడుగు వేయడం లేదు. సుదీర్ఘ కాలం యుద్ధం కొనసాగే అవకాశం ఉందని తెలిసి ఇరాన్ అణు కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో నిలిపివేయదని అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రకటించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తో జరిగిన టెలిఫోన్ సంభాషణలో ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం.

ఇరాన్ అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులను తీవ్రతరం చేశాయి. తొమ్మిదోరోజున కీలకమైన మూడు అణుకేంద్రాలపై ప్రత్యర్థి విరుచుకుపడిన అనంతరం ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ నుంచి ఓ ప్రకటన వెలువడింది. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ, ఇరాన్ అణు కార్యక్రమం విషయమై దౌత్యపరమైన ఒప్పందానికి సిద్ధమేనని.. అంతేకానీ అణు ఆశయాలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని పెజెష్కియన్ నొక్కి చెప్పారు. ఇజ్రాయెల్ దాడులను ఆపేస్తే శాంతియుత చర్చలకు తాము సుముఖంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. పౌర అణుకార్యక్రమాన్ని కొనసాగించడం ఇరాన్ హక్కు అని.. బెదిరింపులు లేదా యుద్ధం చేయడం ద్వారా తమ ప్రయత్నాలను ఎవరూ నిలువరించలేరని స్పష్టం చేశారు. అదేగాక, టెహ్రాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేస్తోందన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అలాగే, జెనీవాలో ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీతో ఐరోపా నేతలు చేసిన దౌత్య చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి.

చాలాకాలం నుంచి ఇరాన్ అణుకార్యకలాపాలపై అమెరికా సహా పలు పాశ్చత్యదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇరాన్ మాత్రం అణుప్రయోగాలు ఇంధనం, వైద్యరంగాల్లో పరిశోధన కోసం మాత్రమే అని వాదిస్తోంది. ఇదిలా ఉంటే, ఇప్పటివరకూ ఇజ్రాయెల్ దాడుల్లో 400 మందికి పైగా మరణించగా.. 3,000 మందికి పైగా క్షతగాత్రులైనట్లు ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. టెహ్రాన్ దాడుల్లో 25 మంది చనిపోగా.. 2517 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది.

ఇవీ చదవండి:

ఫోర్డోతో సహా ఇరాన్‌లోని అణు కేంద్రాలపై అమెరికా ఎటాక్

ఇరాన్‌పై అమెరికా దాడుల్లో 1989 నాటి బాంబర్ల ఉపయోగం.. వాటి స్పెషల్ ఏంటి
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 22 , 2025 | 09:01 AM