Share News

US Strikes Iran: ఫోర్డోతో సహా ఇరాన్‌లోని అణు కేంద్రాలపై అమెరికా ఎటాక్

ABN , Publish Date - Jun 22 , 2025 | 06:35 AM

ఇజ్రాయెల్-ఇరాన్ విషయంలో అగ్రరాజ్యం అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇరాన్‎పై ప్రత్యక్ష యుద్ధానికి (US Strikes Iran) దిగింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక అయిన ట్రూత్ ద్వారా ప్రకటించారు.

US Strikes Iran: ఫోర్డోతో సహా ఇరాన్‌లోని అణు కేంద్రాలపై అమెరికా ఎటాక్
US airstrike Iran

అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా సైన్యం దాడులు (US Strikes Iran) చేసిందని ఆయన తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా తెలిపారు. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్ అణు వ్యవస్థను నాశనం చేయడానికి అమెరికా నేరుగా ఈ చర్యలకు దిగినట్లు వెల్లడించారు. ఇరాన్ ప్రతీకార బెదిరింపుల నేపథ్యంలో ఎటాక్ చేశామని వెల్లడించారు. దీంతో మధ్యప్రాచ్యంలో మరింత దాడులు జరిగే అవకాశం ఉంది.


భూగర్భంలో దాగి ఉన్న

గత 9 రోజులుగా ఇజ్రాయెల్, ఇరాన్‌పై దాడులు జరుపుతోంది. ఈ దాడులు ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థ, క్షిపణుల సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకున్నాయి. అలాగే, ఇరాన్ అణు ఇంధన సౌకర్యాలకు కూడా నష్టం కలిగించాయి. అమెరికా అధికారుల అభిప్రాయం ప్రకారం ఇరాన్‎లోని లోతైన భూగర్భంలో దాగి ఉన్న అణు కేంద్రాలను నాశనం చేయడానికి బీ2 స్టెల్త్ బాంబర్లను ఉపయోగించింది. ఈ దాడులలో ఫోర్డో, నటాంజ్, ఎస్ఫాహాన్‌లో ఉన్న మూడు అణు కేంద్రాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇరాన్ అణు కార్యక్రమానికి కీలకమైన ఈ సౌకర్యాలు భూమి లోతుల్లో రక్షణలతో నిర్మించబడ్డాయి. ఈ కేంద్రాలపై బీ2 స్టెల్త్ బాంబర్లను (B2 Stealth Bombers) ఉపయోగించారు.


అమెరికా ఎందుకు

అమెరికా ఈ దాడుల ద్వారా ఇరాన్ అణు సామర్థ్యాన్ని గణనీయంగా బలహీనపరిచే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో దీర్ఘ కాలంగా ఉన్న శత్రుత్వంతో ఉన్న అమెరికా.. ఇజ్రాయెల్‌ విషయంలో ప్రస్తుతం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇరాన్ అణు వ్యవస్థ గత కొన్నేళ్లుగా అంతర్జాతీయంగా ఆందోళనలను రేకెత్తిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ దీనిని మధ్య ప్రాచ్యంలో స్థిరత్వానికి ముప్పుగా భావిస్తున్నాయి. ఇరాన్ ఈ దాడులకు ప్రతిస్పందనగా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని, తగిన సమయంలో సమాధానం ఇస్తామని ప్రకటించింది. దీంతో ఈ పరిణామాలు మధ్య ప్రాచ్యంలో సైనిక సంఘర్షణకు దారితీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికా ఈ దాడులకు ఎందుకు నేరుగా దిగిందనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి.


ఇవీ చదవండి:

ఏఐ పవర్డ్ గ్లాసెస్‌ను విడుదల చేసిన మెటా.. ఫీచర్లు చూశారా..


ఈ యాప్ 20 లక్షల పోయిన ఫోన్‌లను గుర్తించింది.. ఎలాగంటే..

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 22 , 2025 | 09:12 AM