Share News

Lost Phones Tracker: ఈ యాప్ 20 లక్షల పోయిన ఫోన్‌లను గుర్తించింది.. ఎలాగంటే..

ABN , Publish Date - Jun 21 , 2025 | 01:16 PM

ఇప్పటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్లు ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగంగా మారిపోయాయి. వినోదం, విద్య, కమ్యూనికేషన్ ఇలా ఏం కావాలన్నా కూడా ఫోన్ వినియోగం తప్పనిసరిగా మారింది. కానీ అదే మొబైల్ ఫోన్ పోతే ఎలా, ఏం చేయాలనే (Lost Phones Tracker) విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Lost Phones Tracker: ఈ యాప్ 20 లక్షల పోయిన ఫోన్‌లను గుర్తించింది.. ఎలాగంటే..
Lost Phones Tracker

ప్రస్తుత డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్లు మన జీవనశైలిలో ఒక ముఖ్య భాగంగా మారిపోయాయి. ఇదే సమయంలో ఫోన్ చోరీలు, మిస్ అయిన ఫోన్ల సంఖ్య (Lost Phones Tracker) కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం కొత్త సాంకేతిక పరిష్కారాలపై పోకస్ చేసింది. ఈ క్రమంలోనే సంచార సాథీ (Sanchar Saathi) ప్లాట్‌ఫామ్ ద్వారా ఇప్పటివరకు 20.28 లక్షల కంటే ఎక్కువ మిస్ అయిన లేదా దొంగిలించిన ఫోన్లను గుర్తించినట్లు టెలికాం శాఖ మంత్రి, చంద్రశేఖర్ పెమ్మాసాని తెలిపారు. ఇదే సమయంలో వాటిని తిరిగి పొందడంలో సాయం చేసినట్లు చెప్పారు.


సంచార సాథీ

సంచార సాథీ ప్రస్తుతం ఒక మొబైల్ యాప్, వెబ్ అప్లికేషన్ విధానంలో పనిచేస్తుంది. దీని ద్వారా ప్రజలు తమ మిస్ అయిన, దొంగిలించిన ఫోన్ల గురించి సులభంగా రిపోర్ట్ చేసుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్ సహాయంతో టెలికాం శాఖ మోసపూరిత కాల్స్, ఫ్రాడ్యులెంట్ కనెక్షన్స్ పై నిఘా ఉంచుతుంది. ఇప్పటికే 33.5 లక్షల కంటే ఎక్కువ ఫోన్లను ప్రభుత్వం బ్లాక్ చేసి, అవి చోరీ కాకుండా నిరోధించింది.


ఫోన్ ట్రేస్, బ్లాక్ చేయడం ఎలా?

ఇందుకోసం మీరు సంచార సాథీ(Sanchar Saathi)లో మీ ఫోన్ IMEI నంబర్ ఉపయోగించి రిపోర్ట్ చేయాలి. ఈ IMEI నంబర్ ఫోన్ కి ప్రత్యేక గుర్తింపు సంకేతంగా ఉంటుంది. IMEI లేకుండా ఫోన్ మిస్ అయినట్లు లేదా దొంగిలించబడ్డట్లు రిపోర్ట్ చేయడం సాధ్యం కాదు. రిపోర్ట్ చేసాక, సంబంధిత టెలికాం సంస్థలు ఆ ఫోన్ ను బ్లాక్ చేసి దొంగతనాన్ని ఆపగలుగుతాయి. అలాగే, ఆ ఫోన్ గురించి ట్రేస్ చేస్తాయి. అంటే అక్కడ ఉన్న GPS సిగ్నల్ ఆధారంగా ఫోన్ ప్రస్తుత స్థితి గురించి సమాచారం తెలుసుకుంటారు.


సాధించిన విజయాలు

ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇప్పటివరకు 20.28 లక్షల హ్యాండ్‌సెట్లను గుర్తించగా, 4.64 లక్షల మొబైల్ ఫోన్లను యజమానులకు విజయవంతంగా తిరిగి ఇచ్చినట్టు కేంద్ర మంత్రి చెప్పారు. అంటే దాదాపు 22.9 శాతం రికవరీ రేటు ఉందని వెల్లడించారు. ఈ విధంగా ప్రజలకు వారి ఫోన్లను సురక్షితంగా రక్షించేందుకు ప్రభుత్వం సాంకేతిక సహాయం అందిస్తోంది. అలాగే ఫ్రాడ్యులెంట్ కాల్స్, ఫేక్ కానెక్షన్ల ఫిర్యాదులను కూడా సంచార సాథీ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. మీరు ఈ సేవలను పొందాలంటే https://sancharsaathi.gov.in/ వెబ్‌సైట్ ను సందర్శించవచ్చు లేదా మీ మొబైల్ ఫోన్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ Citizen Centric Services అనే విభాగంలో మీరు ఈ సేవలను పొందవచ్చు.


ఇవీ చదవండి:

ఏఐ పవర్డ్ గ్లాసెస్‌ను విడుదల చేసిన మెటా.. ఫీచర్లు చూశారా..


9వ రోజు కొనసాగుతున్న ఇజ్రాయెల్-ఇరాన్ వార్..దౌత్యం ఎప్పుడు

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 21 , 2025 | 01:21 PM