ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

USA: ఈ విషయంలో ఇండియా తర్వాతే చైనా: అమెరికా

ABN, Publish Date - May 29 , 2025 | 01:02 PM

Indian Students in US: 2023-24 మధ్య స్టూడెంట్ వీసా పొందిన విదేశీ విద్యార్థుల జాబితాను అమెరికా విడుదల చేసింది. ఇందులో చైనా రెండవ స్థానంలో ఉండగా.. భారతీయ విద్యార్థుల సంఖ్య ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిలో ఉందని నివేదిక పేర్కొంది.

Indian Students in the US Latest Report

Indian Students Tops the Chart In USA: స్డూడెంట్ వీసాల జారీ విషయంలో అగ్రరాజ్యం కఠిన వైఖరితో ముందుకెళ్తోంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అమెరికా రాయబార కార్యాలయాల్లో స్డూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఇంటర్వ్యూల (Student Visa Interviews) నిర్వహణ తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రధానంగా చైనా విద్యార్థులనే టార్గెట్ చేసింది. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్నవారు లేదా కీలక రంగాల్లో చదువుతున్న చైనీస్ స్డూడెంట్స్ వీసాలను రద్దు చేస్తున్నట్లు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియో సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా పై చదువుల కోసం అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా చర్చనీయాంశంగా మారింది.


టాప్ ప్లేస్‌లో భారత్..

2023-24 సంవత్సరంలో భారతీయ విద్యార్థుల సంఖ్య ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరింది. ఓపెన్ డోర్స్ రిపోర్ట్ 2024 ప్రకారం, 3,30,000 కంటే ఎక్కువ మంది భారతీయులు అమెరికాలో చదువుతున్నారు. దీంతో భారతదేశం అమెరికాకు అత్యధిక విద్యార్థులను పంపే దేశంగా నిలిచింది. 2022-23లో ఉన్న 2,68,923 నుంచి 23 శాతం పెరిగిందని నివేదిక పేర్కొంది. ఇక రెండవ స్థానంలో చైనా ఉంది.


ఓపెన్ డోర్స్ రిపోర్ట్ 2024 పై US ఎంబసీ షేర్ చేసిన నోట్ ప్రకారం, యునైటెడ్ స్టేట్స్‌లో చదివే విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అధికంగా ఉన్నారు. మొత్తం విదేశీ విద్యార్థుల్లో 29 శాతం మనవాళ్లే. తాజా బిజినెస్ స్టాండర్డ్స్ డేటా ప్రకారం వరసగా భారత్ (3,30,000), చైనా (277,398), దక్షిణ కొరియా (43,149), కెనడా (28,998), తైవాన్ (23,157)లు ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఇటీవల ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విదేశీ విద్యార్థులను చేర్చుకోకూడదనే ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఆ సంగతి అంతా మరువక ముందే చైనా విద్యార్థుల విద్యార్థుల వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి విద్యార్థులకు షాకిచ్చింది.


ఇవి కూడా చదవండి..

తెగిన ట్రంప్-మస్క్ స్నేహబంధం.. కారణమిదే..

కుమారుడికి సీటివ్వలేదనే హార్వర్డ్‌పై ట్రంప్‌ కక్ష?

మరిన్ని అంతర్జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 29 , 2025 | 01:32 PM