ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Elon Musk: తెగిన ట్రంప్-మస్క్ స్నేహబంధం.. కారణమిదే..

ABN, Publish Date - May 29 , 2025 | 07:32 AM

Elon Musk leaves Trump: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలక వర్గం నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని ఆయన బుధవారం తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Elon Musk Leaves Trump Administration

Elon Musk exits Donald Trump Administration: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో (Donald Trump) ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) బ్రొమాన్స్ ముగిసింది. ఇద్దరి మధ్య కొన్నాళ్ల నుంచి చెడిందనే ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలోనే మస్క్ డోజ్ (DOGE) పదవికి టాటా చెప్పేశాడు. డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ పదవీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్టు బుధవారం ఎక్స్ వేదికగా ప్రకటించాడు.


సమయం ముగిసింది: మస్క్

అమెరికా ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా నా షెడ్యూల్ ముగిసిందని ఎక్స్ వేదికగా మస్క్ ప్రకటించారు. ప్రభుత్వంలో వృథా ఖర్చును తగ్గించే అవకాశం కల్పించినందుకు @realDonaldTrump కు కృతజ్ఞతలు తెలిపారు. డోజ్ మిషన్ కాలక్రమేణా మరింతగా బలోపేతం అవుతుందని, ఇది రాబోయే రోజుల్లో.. ప్రభుత్వానికి ఆక్సిజన్‌లా పనిచేస్తుందని, ఒక జీవన విధానంలా మారుతుందని మస్క్ చెప్పారు.


మే 30తో ముగియాల్సి ఉంది

ఎలాన్ మస్క్ ట్రంప్ పరిపాలనా వర్గం నుంచి వైదొలగుతున్నారనే విషయాన్ని వైట్ హౌస్ అధికార ప్రతినిధి కూడా ధృవీకరించారు. డోజ్ అధిపతిగా ఎలాన్ మస్క్ పదవీకాలం మే 30తో ముగియనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వాన్ని పునర్నిర్మించడానికి DOGE ప్రయత్నాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా ట్రంప్ పాలక వర్గ ప్రతినిధి స్పష్టం చేశారు.


గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ వెన్నంటే నిలిచి సహాయ సహకారాలు అందించాడు ఎలాన్ మస్క్. ఇందుకు బదులుగా ప్రభుత్వంలో డోజ్ అధిపతిగా టెస్లా చీఫ్ కు కీలక బాధ్యతలు అప్పగించాడు ట్రంప్. అయితే, కొన్నాళ్లుగా ఇద్దరికీ చెడిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ట్రంప్ తీసుకురానున్న కొత్త బిల్లుపై మస్క్ బాహాటంగానే వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ బిల్లు తీసుకొస్తే ప్రభుత్వంలో అనవసర ఖర్చులు తగ్గించేందుకు ఇన్నాళ్లు డోజ్ పడ్డ కష్టం వృథా అవుతుందని.. అధిక బడ్జెట్ కేటాయించాల్సి రావడం వల్ల ద్రవ్యలోటు కూడా పెరుగుతుందని అసహనం వ్యక్తం చేశారు. అంతలోనే డోజ్ పదవికి గుడ్ బై చెప్పడం గమనార్హం ‌.


ఇవి కూడా చదవండి..

అమెరికాలో విలీనమైతే కెనడాకు ‘గోల్డెన్‌ డోమ్‌’ ఉచితం: ట్రంప్‌

Donald Trump: కుమారుడికి సీటివ్వలేదనే హార్వర్డ్‌పై ట్రంప్‌ కక్ష?

మరిన్ని అంతర్జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 29 , 2025 | 10:26 AM