Share News

Donald Trump: అమెరికాలో విలీనమైతే కెనడాకు ‘గోల్డెన్‌ డోమ్‌’ ఉచితం: ట్రంప్‌

ABN , Publish Date - May 29 , 2025 | 05:59 AM

అమెరికాలో విలీనం కావడానికి కెనడా అంగీకరిస్తే.. తమ గోల్డెన్‌ డోమ్‌ క్షిపణి రక్షణ వ్యవస్థలో ఉచితంగా చేరవచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు.

Donald Trump: అమెరికాలో విలీనమైతే కెనడాకు ‘గోల్డెన్‌ డోమ్‌’ ఉచితం: ట్రంప్‌

వాషింగ్టన్‌, మే 28: అమెరికాలో విలీనం కావడానికి కెనడా అంగీకరిస్తే.. తమ గోల్డెన్‌ డోమ్‌ క్షిపణి రక్షణ వ్యవస్థలో ఉచితంగా చేరవచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. లేకపోతే ఈ వ్యవస్థలో భాగం కావడానికి కెనడాకు 61 బిలియన్‌ డాలర్లు ఖర్చవుతుందని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌లో మంగళవారం ఆయన పేర్కొన్నారు.


అమెరికా గగనతలంలోకి శత్రుదేశాల క్షిపణులు ప్రవేశించకుండా 75 బిలియన్‌ డాలర్ల వ్యయంతో 2029 చివరి నాటికి గోల్డెన్‌ డోమ్‌ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ట్రంప్‌ ఇటీవల ప్రకటించారు. ఈ వ్యవస్థలో చేరడానికి కెనడా ఆసక్తి కనబర్చిన నేపథ్యంలో ట్రంప్‌ స్పందించారు.

Updated Date - May 30 , 2025 | 02:57 PM