DRDOలో రీసెర్చ్ ఫెలోషిప్‌గా చేరేందుకు మంచి ఛాన్స్.. స్టైఫండ్ ఏకంగా రూ.37 వేలు..
ABN, Publish Date - Jun 24 , 2025 | 09:55 AM
DRDO JRF Recruitment 2025: భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO)లో కలలుగనే యువతకు మంచి అవకాశం. DRDO జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టులకు నియామకాలను ప్రకటించింది. స్టైపెండ్ నెలకు ఏకంగా రూ. 37,000. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు డీఆర్‌డీవో అధికారిక వెబ్ సైట్ drdo.gov.in ని సందర్శించి వెంటనే దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాల కోసం..
DRDO DRDE JRF Recruitment 2025: దేశానికి సేవ చేయాలని, సాంకేతికత ద్వారా ప్రపంచానికి తోడ్పడాలని కలలుగనే యువతకు గుడ్ న్యూస్. గ్వాలియర్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DRDE) కింద పనిచేస్తున్న ప్రతిష్ఠాత్మక సంస్థ జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం పూర్తిగా ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. స్టైపెండ్ నెలకు ఏకంగా రూ. 37,000. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు డీఆర్‌డీవో అధికారిక వెబ్ సైట్ drdo.gov.in ని సందర్శించి వెంటనే దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాల కోసం..
అర్హత:
ఈ పోస్ట్ కోసం అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో ఫస్ట్ క్లాస్ M.Sc డిగ్రీ కలిగి ఉండాలి. దీనితో పాటు అభ్యర్థి CSIR-UGC NET JRF లేదా NET పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
గరిష్ఠంగా 28 సంవత్సరాలు. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
స్టైఫండ్:
నెలకు రూ. 37,000
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం ఎలా?
అధికారిక వెబ్‌సైట్ drdo.gov.in ని సందర్శించండి .
హోమ్‌పేజీలో కెరీర్ విభాగంపై క్లిక్ చేయండి.
దరఖాస్తు లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా నమోదు చేసుకోండి.
లాగిన్ అయి ఫారమ్ నింపండి. రుసుము చెల్లించి ఫారమ్ సమర్పించండి.
ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోండి. భవిష్యత్ ఉపయోగం కోసం ఒక ప్రింటవుట్ తీసుకోవడం మర్చిపోకండి.
ఇంకా, పూర్తిగా నింపిన ఫారమ్‌ను director.drdr@gov.in లేదా anupam.deal@gov.in ఈమెయిల్ చిరునామాకు పంపాలి..
ఇంటర్వ్యూ చిరునామా
DRDE గ్వాలియర్, ఝాన్సీ రోడ్, రైల్వే స్టేషన్ నుండి 1 కి.మీ., FCI గోడౌన్ సమీపం ల్యాండ్‌మార్క్ హోటల్, ల్యాండ్‌మార్క్ రోడ్
అధికారిక నోటిఫికేషన్ లింక్, వెబ్‌సైట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
డిగ్రీ అర్హతతో SBIలో ఆఫీసర్ అయ్యే ఛాన్స్.. 2600లకు పైగా పోస్టులకు నోటిఫికేషన్..
ఇంటర్ పాసైన వారికి రైల్వేలో ఉద్యోగాలు.. జీతం ఎంతో తెలుసా..
For Educational News And Telugu News
Updated Date - Jun 24 , 2025 | 02:50 PM