AP News: బిడ్డను చూడకుండానే.. తండ్రి కన్నుమూత
ABN, Publish Date - Nov 13 , 2025 | 01:18 PM
బిడ్డను చూడకుండానే.. తండ్రి కన్నుమూసిన విషాద సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ధర్మవరానికి చెందిన దిలీప్‌కుమార్ అనే యువకుడి భార్య బిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. తల్లీ బిడ్డలను చూసేందుకు ఆయన బైక్‌పై బయలుదేరగా.. అది అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు.
- ఆస్పత్రిలో కుమార్తె జననం
- చూసేందుకెళ్తూ రోడ్డు ప్రమాదంలో తండ్రి దుర్మరణం
బత్తలపల్లి(అనంతపురం): ఆస్పత్రిలో బిడ్డ జన్మించిందని తెలియగానే ఆనందంగా చూడడానికి బయల్దేరిన తండ్రి మార్గమధ్యలోనే దుర్మరణం చెందాడు. బిడ్డను చూడకుండానే కన్నుమూశాడు. మండలకేంద్రంలోని వైజంక్షన్‌లో బుధవారం రాత్రి బైక్ కిందపడి ధర్మవరానికి చెందిన దిలీప్‌కుమార్ (25) మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ధర్మవరం(Dharmavaram)లోని శాంతినగర్‌కు చెందిన నాగేంద్ర కుమారుడు దిలీప్‌కుమార్ పట్టు చీరలకు సంబధించి రేషన్ వ్యాపారం చేస్తుండేవాడు.
ఇతడికి భార్య లాస్య, కుమార్తె ఉన్నారు. అనంతపురం(Ananthapur) ప్రభుత్వ ఆస్పత్రిలో లాస్య బుధవారం ప్రసవించింది. ఆడ శిశువుకు జన్మనిచ్చింది. బిడ్డను చూసేందుకు దిలీప్‌కుమార్ ఆనందంగా బయల్దేరాడు. ధర్మవరం నుంచి బైక్‌పై బయల్దేరాడు. బత్తలపల్లి దాటగానే వైజంక్షన్ వద్ద బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది.
దీంతో తీవ్రంగా గాయపడిన దిలీప్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కుటుంబికులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని, బోరున విలపించారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సిమెంట్ రంగంలో రూ 1.2 లక్షల కోట్ల పెట్టుబడులు
సైబర్ దాడుల నుంచి రక్షణకు టాటా ఏఐజీ సైబర్ ఎడ్జ్
Read Latest Telangana News and National News
Updated Date - Nov 13 , 2025 | 01:18 PM