Tata AIG Cyber Edge: సైబర్ దాడుల నుంచి రక్షణకు టాటా ఏఐజీ సైబర్ ఎడ్జ్
ABN , Publish Date - Nov 13 , 2025 | 06:31 AM
పెరిగిపోతున్న సైబర్ దాడుల నుంచి కంపెనీలకు ఆర్థిక రక్షణ కల్పించేందుకు టాటా ఏఐజీ ‘సైబర్ ఎడ్జ్’ పేరుతో కొత్త బీమా పాలసీ తీసుకొచ్చింది. సైబర్ దాడులతో ఏర్పడే ఆర్థిక నష్టాలతో...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): పెరిగిపోతున్న సైబర్ దాడుల నుంచి కంపెనీలకు ఆర్థిక రక్షణ కల్పించేందుకు టాటా ఏఐజీ ‘సైబర్ ఎడ్జ్’ పేరుతో కొత్త బీమా పాలసీ తీసుకొచ్చింది. సైబర్ దాడులతో ఏర్పడే ఆర్థిక నష్టాలతో పాటు, పేరు ప్రతిష్ఠలకు ఏర్పడే నష్టాల నుంచీ కంపెనీలను ఈ పాలసీ కాపాడుతుందని టాటా ఏఐజీ కంపెనీ (ఫైనాన్సియల్ లైన్స్) నేషనల్ హెడ్ నజ్మ్ బిల్‌గ్రామి చెప్పారు. ఇప్పటి వరకు దేశంలోని 1,700 నుంచి 1,800 కంపెనీలు ఈ పాలసీ తీసుకున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం కార్పొరేట్ సైబర్ ఇన్సూరెన్స్ మార్కెట్ విలువ రూ.900 కోట్లకు చేరిందని, ఏటా 25ు చొప్పున సగటు వృద్ధి నమోదు చేస్తోందని చెప్పారు. సైబర్ దాడుల విషయంలో ఏపీ, తెలంగాణ కంపెనీలు దేశంలో రెండో స్థానంలో ఉన్నా, సైబర్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడంలో బాగా వెనకబడి ఉన్నట్టు చెప్పారు. దీంతో 2028 నాటికి ఈ రెండు రాష్ట్రాల్లో రెండు రెట్ల వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.
ఇవీ చదవండి:
మీ చూపు శక్తివంతమైనదైతే.. ఈ ఫొటోలో తోడేలును 9 సెకెన్లలో కనిపెట్టండి..
మీ మిక్సీ జార్ తిరగడం లేదా.. ఈ సూపర్ ట్రిక్ ఉపయోగించి చూడండి..