Share News

Mixer jar hack: మీ మిక్సీ జార్ తిరగడం లేదా.. ఈ సూపర్ ట్రిక్ ఉపయోగించి చూడండి..

ABN , Publish Date - Nov 11 , 2025 | 10:53 AM

వంటగదిలో మనం ప్రతిరోజూ ఉపయోగించే మిక్సర్ కొన్నిసార్లు మొరాయిస్తుంటుంది. కొన్నిసార్లు నెమ్మదిగా తిరగడం, పెద్దగా శబ్దం రావడం జరుగుతుంది. మిక్సీ జార్‌లోని బ్లేడ్ జామ్ అయిపోయి తిరగడం మానేస్తుంది. దాంతో వంట పని ఆగిపోతుంది.

Mixer jar hack: మీ మిక్సీ జార్ తిరగడం లేదా.. ఈ సూపర్ ట్రిక్ ఉపయోగించి చూడండి..
smart household hacks

వంటగదిలో మనం ప్రతిరోజూ ఉపయోగించే మిక్సర్ కొన్నిసార్లు మొరాయిస్తుంటుంది. కొన్నిసార్లు నెమ్మదిగా తిరగడం, పెద్దగా శబ్దం రావడం జరుగుతుంది. మిక్సీ జార్‌లోని బ్లేడ్ జామ్ అయిపోయి తిరగడం మానేస్తుంది. దాంతో వంట పని ఆగిపోతుంది. అలాంటి సమయంలో వాడాల్సిన ట్రిక్ గురించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను తక్కువ సమయంలోనే మిలియన్ల మంది వీక్షించారు (jammed mixer blade fix).


hello_oddly అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. ఆ మహిళ మొదట మిక్సర్ బ్లేడ్‌ను చేతులతో తిప్పడానికి ప్రయత్నించింది. అయితే అది తిరగలేదు. దీంతో ఆ మహిళ ముందుగా ఆ బ్లేడ్ మీద నూనె వేసింది. ఆ తర్వాత ఆ జార్‌ను వెనుక వైపునకు తిప్పి వాసెలిన్ పూసింది. తర్వాత ఆ జార్‌ను కొద్దిగా వేడి చేసింది. ఆ తర్వాత మిక్సీ జార్ పని చేసింది. ఈ ట్రిక్ చాలా మందిని ఆశ్చర్యపరిచింది (oil and moisturizer trick).


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Kitchen Hack). ఇప్పటివరకు ఈ వీడియోను 75 లక్షల మంది వీక్షించారు. 28 వేల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. వేడి నీళ్లు వేయడం వల్ల కూడా మిక్సీ బ్లేడ్‌లు స్ట్రక్ కావడం తగ్గుతుందని ఒకరు కామెంట్ చేశారు. ఇలాంటి చిన్న చిన్న రిప్లేర్లు నేర్చుకుంటే సమయం, డబ్బు ఆదా అవుతుందని మరొకరు పేర్కొన్నారు. ఇది చాలా మంచి ట్రిక్ అని మరొకరు కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి:

పాక్ ఆర్మీ చీఫ్‌‌‌కు లబ్ధి చేకూర్చే రాజ్యాంగ సవరణ.. భగ్గుమన్న ప్రతిపక్షాలు

ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 11 , 2025 | 10:53 AM